ఏపీలో మందుబాబులకు గుడ్ న్యూస్- తగ్గనున్న మద్యం ధరలు-ఎంతో తెలుసా ?
ఏపీలో కొత్త సంవత్సరం సమీపిస్తున్న వేళ మందుబాబులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే రాష్ట్రంలో మద్యం అమ్మకాలు, బ్రాండ్లను కట్టడి చేయడంతో ఇబ్బందులు పడుతున్న మందుబాబులకు ధరలు కూడా మంటెక్కిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మద్యంపై వ్యాట్ రేటును మరోసారి సవరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో మద్యం ధరలు తగ్గడంతో పాటు అక్రమ మద్యం రవాణా కూడా తగ్గుతుందని ప్రభుత్వం చెబుతోంది.

మందుబాబులకు గుడ్ న్యూస్
ఏపీలో మందుబాబులకు ప్రభుత్వం గతంలో వరుసగా షాకులు ఇచ్చింది. మద్యం ధరల పెంపుతో పాటు ప్రధాన బ్రాండ్లను నిషేధించి వాటి స్దానంలో కొత్త కొత్త బ్రాండ్లను తీసుకొచ్చింది. వీటిని తాగలేక శానిటైజర్లు తాగి మృత్యువాత పడిన వారు కూడా ఉన్నారు. కానీ కొంతకాలంగా మద్యం ఆదాయం పెంపుపై దృష్టిపెట్టిన ప్రభుత్వం వరుసగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఇవాళ మరో గుడ్ న్యూస్ చెప్పింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో బహుళ ప్రయోజనాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మరోసారి వ్యాట్ రేట్ల సవరణ
ఏపీలో మద్యంపై విధిస్తున్న వ్యాట్ పన్ను రేట్లను మరోసారి సవరిస్తూ ప్రభుత్వం ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. వ్యాట్ లో మార్పులు చేస్తూ రాష్ట్ర ఆబ్కారీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎక్సైజ్ డ్యూటీలో విధిస్తున్న స్పెషల్ మార్జిన్ హేతుబద్దతను తీసుకొచ్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీంతో మద్యం ధరలపై విధిస్తున్న పన్నుల్లో హేతుబద్ధత వస్తుందని, దీంతో పలు ప్రయోజనాలు ఉన్నట్లు చెబుతోంది.

తగ్గనున్న రేట్లు
తాజాగా ప్రభుత్వం చేపట్టిన మద్యం ధరలపై వ్యాట్ రేటు సవరణ ద్వారా రాష్ట్రంలో మద్యం ధరలు తగ్గనున్నాయని సర్కార్ పేర్కొంది. ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్ వెరైటీపై 5-12 శాతం మేర, మిగతా అన్ని రకాలపై 20 శాతం వరకు ధర తగ్గే అవకాశం ఉందని తెలిపింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మద్యం, నాటుసారా అరికట్టడమే దీని లక్ష్యమని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ తెలిపారు. దీంతో ఆయా వెరైటీలు మందుబాబులకు మరింత అందుబాటులోకి రానున్నాయి. అక్రమ మద్యం అరికట్టేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications