రెండెకరాల్లో పవన్ ఇల్లు కడితే ఓకెనా?, రాజధానికి మాత్రం వద్దా?: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం 33వేల ఎకరాలను సేకరించడాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తప్పుపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆయనకు కౌంటర్ ఇచ్చారు.
పవన్‌కల్యాణ్ రెండెకరాల్లో ఇల్లు కట్టుకోవచ్చు కానీ.. రాజధాని అమరావతి నిర్మాణానికి 33 వేల ఎకరాలు వద్దా? అని ప్రశ్నించారు. రాష్ట్రంపై ప్రధాని మోడీ చేసిన కుట్ర బహిర్గతమైందని, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మోడీ కాళ్ళకు మొక్కటమే ఇందుకు నిదర్శనమని అన్నారు.

కేంద్రమంత్రి పదవి అడుగుతారేమో!:
కేసుల నుంచి విముక్తి కావడానికే వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాళ్లకు మొక్కారని రాష్ట్ర మంత్రి జవహర్ ఆరోపించారు. ఎన్డీయేలో కేంద్రమంత్రి పదవి కూడా అడుగుతారేమోనని పేర్కొన్నారు. రాష్ట్రంపై బీజేపీ, వైసీపీల కుట్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని అన్నారు.












Click it and Unblock the Notifications