ఆ టీడీపీ ఎమ్మెల్యేని నమ్మని సీఎం చంద్రబాబు
ఏపీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ,జనసేన , బీజేపీ కూటమి ఏర్పడి అధికార వైసీపీని ఢీ కొట్టాయి. గత ఎన్నికల్లో 151 సీట్లలో విజయం సాధించిన వైసీపీ ఈ ఎన్నికల్లో కేవలం 11 సీట్లలో మాత్రమే విజయం సాధించడం సంచలనంగా మారింది. ఆ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. 175 సీట్లగాను 164 సీట్లు గెలుచుకుని కూటమి అధికారంలోకి రావడం జరిగింది. బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశారు.
తెలుగు రాజకీయాల్లో నాలుగు సార్లు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసి రికార్డు సృష్టించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ పలువురు కేంద్ర మంత్రులు సినీ ప్రముఖులు హాజరయ్యారు. చంద్రబాబుతో పాటు మొత్తం 24 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన వారిలో నారా లోకేష్, పవన్ కల్యాణ్ సైతం ఉన్నారు. ఇదిలా ఉంటే టీడీపీ సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి మరోసారి నిరాశే ఎదురైంది. 1983 నుంచి వరుస ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధిస్తున్న ఆయనకు మంత్రి పదవి తీరని కలగానే మిగిలిపోయింది.

2019 ఎన్నికల్లో జగన్ ప్రభంజనాన్ని కూడా తట్టుకుని మరీ ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేసిన ఆయన 50 వేలకు పైగానే మెజార్టీతో విజయం సాధించారు. దీంతో గోరంట్ల బుచ్చయ్యచౌదరికి ఈసారి కేబినెట్ లో తనకు ఖచ్చితంగా స్థానం దొరుకుతుందని భావించారు. ఆశించారు. కానీ ఆయన అనుకున్నది జరగలేదు. పార్టీని నమ్మకమైన నేతగా పేరున్న గోరంట్ల బుచ్చయ్యచౌదరిని ఈసారి కూడా పక్కన పెట్టారు.
ఆయన తనకు ఇదే చివరి ఎన్నిక అని పదే పదే ఎన్నికల ప్రచారంలో చెబుతూ వస్తున్నారు. అయినప్పటికి సీఎం చంద్రబాబు ఆయన్ను గుర్తించలేదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. దీంతో గోరంట్ల బుచ్చయ్యచౌదరి కల నెరవేరదా? అన్న అనుమానం ఆయన అనుచరుల్లో మొదలైంది. సన్నిహితులు, పార్టీ నాయకులు కూడా గోరంట్లకు అవకాశమిచ్చి ఉంటే పెద్దాయన ఆనందపడే వారన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే గోరంట్లకు ఈ దఫా పదవి దక్కడంతో ఆయన నిరాశలో కూరుకుపోయారు.












Click it and Unblock the Notifications