చంద్రబాబు పుట్టి పెరిగిన సొంత ఊరిలో ఏం జరిగిందో తెలుసా?, తిరుపతి పక్కలో?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టి పెరిగిన ఆయన సొంత ఊరు చంద్రగిరి నియోజకవర్గంలో మరో గోల్ మాల్ వ్యవహారం బయటపడింది. తిరుపతి సమీపంలోని చంద్రగిరి నియోజకవర్గం ఇప్పటికే వందల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు కబ్జా అయ్యాయని, ఆ భూములను వైసీపీకి చెందిన నాయకులు కొట్టేశారని ఆరోపణలు ఉన్నాయి.
ఇప్పుడు అదే చంద్రగిరి నియోజక వర్గంలో కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ భూమిని కొట్టేసి అందులో పక్కా భవనాలు నిర్మించారు. తిరుపతి సమీపంలోని చంద్రగిరి నియోజకవర్గం పరిధిలో భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇదే సమయంలో చంద్రగిరి నియోజక వర్గంలోని పలు ప్రాంతాల్లోని ప్రభుత్వ భూములపై కొందరు నాయకుల కన్నుపడింది. తమకు అనుకూలంగా ఉన్న అధికారుల మీద ఒత్తిడి తెచ్చి ఆ ప్రభుత్వ భూములు వారి పేరిట రిజిస్టర్ చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.

చంద్రగిరి నియోజకవర్గంలోని రాయలపురం పంచాయతీ పరిధిలోని సర్వేనెంబర్ 318లో పోరంబోకు, కాలువ పొరంబోకు భూములు ఉన్నాయి. గత వైసీపీ ప్రభుత్వంలో కేవలం రెండు సెంట్లు భూమికి పట్టా తీసుకున్న వైసీపీకి చెందిన ఓ నాయకుడు ఆ తర్వాత చుట్టుపక్కల ఉన్న 18 సెంట్ల పోరంబోకు భూమిని కబ్జా చేశారని ఆరోపణలు ఉన్నాయి. అధికారుల అండతో కబ్జా చేసిన భూమిలో పక్కా భవనాలు నిర్మించారు. విషయం తెలుసుకున్న స్థానికులు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే ఆ వైసీపీ నాయకులు వారిపై దౌర్జన్యం చేశారని ఆరోపణలు ఉన్నాయి.
ఇంత జరుగుతున్నా రెవెన్యూ శాఖ అధికారులు అక్రమ కట్టడాలను అడ్డుకోలేదని, అంతేకాకుండా అక్రమ కట్టడాలు నిర్మిస్తున్న వారికి అండగా నిలుస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ ప్రాంతంలో సెంటు భూమి సుమారు రూ. 12 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు ఉంటుందని, కబ్జా చేసిన 18 సెంట్లు భూమి కోట్లాది రూపాయల విలువ చేస్తుందని, వెంటనే ప్రభుత్వ అధికారులు పక్క భవనాల నిర్మాణాన్ని అడ్డుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
కబ్జా చేసిన భూమిలో పక్కా భవనాలు నిర్మిస్తున్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో చక్రం తిప్పిన ఓ మాజీ మంత్రి, మాజీ ఎమ్మెల్యే, అండతో కొందరు నాయకులు ఈ భూములను కబ్జా చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయంపై చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నానికి సమాచారం ఇచ్చామని, ప్రభుత్వ అధికారులకు ఫిర్యాదు చేశామని ప్రజలు అంటున్నారు. చంద్రగిరిలో ప్రభుత్వ భూములు, పొరంబోకు, కాలువ పొరంబోకు భూములు కబ్జా చేశారని ఫిర్యాదులు వచ్చాయని, సర్వే జరిపించి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని రెవెన్యూ శాఖ అధికారులు అంటున్నారు.
-
రాజకీయ దురంధురుడు చంద్రబాబు: స్టీల్ ప్లాంట్ భూమిపూజలో పవన్ కళ్యాణ్ కితాబు! -
వృద్దులు, 12 ఏళ్లలోపు పిల్లలకు టీటీడీ ముఖ్య గమనిక -
ఈ నెల 30 నుంచి తిరుమలలో -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..!












Click it and Unblock the Notifications