విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజభవన్ లో సీజేఐకు తేనేటి విందు : హాజరైన సీఎం జగన్ - న్యాయమూర్తులు..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

ఏపీ పర్యటనకు వచ్చిన సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు ఏపీ గవర్నర్ తేనేటి విందు ఇచ్చారు. రాజ్ భవన్ లో గవర్నర్ ఏర్పాటు చేసిన తేనేటి విందుకు సుప్రీం ప్రధాన న్యాయమూర్తితో పాటుగా సుప్రీం- హైకోర్టు న్యాయమూర్తులు...సీఎం జగన్ దంపతులు హాజరయ్యారు. తొలుత రాజ్ భవన్ కు చేరుకున్న సీజేఐ కు గౌరవ వందనం సమర్పించారు. ఆ తరువాత గవర్నర్ అతిధులతో ముచ్చటించారు.

రాజ్ భవన్ లో తేనేటి విందు

రాజ్ భవన్ లో తేనేటి విందు

న్యాయమూర్తులతో పాటుగా సీఎం జగన్ దంపతులను సన్మానించారు. శనివారం ముఖ్యమంత్రి జగన్ ఏపీ ప్రభుత్వం తరపున తేనేటి విందు ఇవ్వగా.. ఈ రోజు గవర్నర్ ఏర్పాటు చేసారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన తేనేటి విందులో ఏపీ మరింతగా డెవలప్ కావాలని సీజేఐ ఆకాంక్షించారు. తెలుగు వ్యక్తి..ఏపీకి చెందిన న్యాయమూర్తి సుప్రీం ప్రధాన న్యాయమూర్తిగా కీలక హోదాలో ఉండటం గర్వకారణమని ప్రశంసించారు. ఆ తరువాత తన మంత్రులను సీజేఐకు జగన్ పరిచయం చేయగా... న్యాయమూర్తులను సీఎం ను సీజేఐ పరిచయం చేసారు.

సీజేఐ ఎన్వీ రమణ..సీఎం జగన్ దంపతుల హాజరు

సీజేఐ ఎన్వీ రమణ..సీఎం జగన్ దంపతుల హాజరు


ఈ రోజు రాజ్ భవన్ లోనూ తేనేటి విందు సమయంలోనూ అందరూ కలివిడిగా కనిపించారు. సుప్రీం న్యాయమూర్తులు సతీ సమేతంగా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. వారికి గవర్నర్ దంపతులు మెమెంటోలు అందచేసారు. ఉదయం నాగార్జున యూనివర్సిటీలో జరిగిన ఏపీ రాష్ట్ర స్థాయి న్యాయాధికారుల సమావేశంలో పాల్గొన్న సుప్రీం న్యాయమూర్తులు ఆ తరువాత ఏపీ హైకోర్టును సందర్శించారు. హైకోర్టుకు వెళ్లే సమయంలో రాజధాని అమరావతి గ్రామాల్లోని ప్రజలు .. రైతులు సీజేఐకి ఘన స్వాగతం పలికారు.

ఏపీలో ముగిసిన సీజేఐ పర్యటన

ఏపీలో ముగిసిన సీజేఐ పర్యటన

పెద్ద ఎత్తున పూలు జల్లుతూ సుప్రీం ప్రధాన న్యాయమూర్తి హోదాలో తొలి సారి అమరావతికి వచ్చిన సీజేఐకు గౌరవంగా స్వాగతించారు. వారికి కారులోని నిలబడి సీజేఐ నమస్కరిస్తూ హైకోర్టుకు చేరుకున్నారు. అక్కడ సీజేఐ ఎన్వీ రమణను హైకోర్టు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సన్మానించారు. రాజ్ భవన్ లో కార్యక్రమం ముగిసిన తరువాత సీజేఐ..బెజవాడ్ బార్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారు. ఈ కార్యక్రమం ద్వారా సీజేఐ ఎన్వీ రమణ మూడు రోజుల ఏపీ పర్యటన ముగియనుంది.

English summary
Governor Biswabhushan Harichandan hoasts high tea for CJI at Raj Bhavan, CM Jagan also participated the occassion.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X