వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నాది కర్మయోగం: తెలంగాణ, ఎపి వివాదాలపై గవర్నర్ నో కామెంట్

By Pratap
|
Google Oneindia TeluguNews

తిరుమల: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ దంపతులు ఆదివారం శ్రీవారిని దర్శించుకున్నారు. గవర్నర్ దంపతులకు టీటీడీ అధికారులు, ప్రధాన అర్చకులు స్వాగతం పలికారు. శ్రీవారి దర్శనం అనంతరం గవర్నర్ మీడియాతో మాట్లాడారు. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలపై, సెక్షన్ 8పై మాట్లాడడానికి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి ఆయన నిరాకరించారు.

ఇరు రాష్ట్రాల్లో వివాదాలు సమసి పోవాలని శ్రీవారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. దేవుడి దయతో అన్నీ పరిష్కారం అవుతాయని ఆకాంక్షించారు. తెలుగు ప్రజలు సంయమనం పాటించాలని గవర్నర్‌ సూచించారు. ఏడుకొండల స్వామిని ప్రార్థించే సమయంలో ‘నన్ను శరణాగతి చేస్తే నేను చూసుకుంటా' అని స్వామివారు చెప్పినట్లు తన మనసులో అనిపించిందని ఆయన అన్నారు.

రెండు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించి, ప్రజలు సుఖంగా జీవించేలా ఆశీర్వదిస్తానని కూడా స్వామి చెప్పారని, అందుకే ఎలాంటి కష్టాలొచ్చినా ఆపద్బాంధవుడు శ్రీవేంకటేశ్వరుడి దీవెనలతో తొలగిపోతాయని, ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారని నమ్ముతున్నానని నరసింహన్‌ వ్యాఖ్యానించారు. రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్‌ చదలవాడ కృష్ణమూర్తి, ఈవో సాంబశివరావు, జేఈవో భాస్కర్‌, డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ కలి సి తీర్థప్రసాదాలు, చిత్రపటం, ఆధ్యాత్మిక ప్రచురణలను బహూకరించారు.

తిరచనూరులో గవర్నర్ దంపతులు

తిరచనూరులో గవర్నర్ దంపతులు

గవర్నర్ నరసింహన్ దంపతులు ఆదివారంనాడు తిరచనూరు సందర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ, ఎపి వివాదాలపై ఆయన ఆచితూచి మాట్లాడారు.

తిరచనూరులో గవర్నర్ దంపతులు

తిరచనూరులో గవర్నర్ దంపతులు

గవర్నర్ తిరుమల శ్రీవారిని దర్శించుకుని మీడియా ప్రతినిధులతో కూడా మాట్లాడారు. రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు సమసిపోతాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

సంయమనం పాటించాలి..

సంయమనం పాటించాలి..

రెండు రాష్ట్రాల ప్రజలే కాకుండా రాజకీయ నాయకులు కూడా సంయమనం పాటించాలని ఆయన కోరారు. తాను కర్మయోగాను పాటిస్తానని చెప్పారు.

తిరచనూరులో గవర్నర్ దంపతులు

తిరచనూరులో గవర్నర్ దంపతులు

తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి ముందు గవర్నర్ దంపతులు తిరుచనూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.

నాది కర్మయోగం..

నాది కర్మయోగం..

తనది కర్మయోగమని గవర్నర్ నరసింహన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మీడియా ప్రతినిధులతో అన్నారు. ఫలితాన్ని మనం ఆశించకూడదని ఆయన అన్నారు.

విధులను నిర్వహిస్తే...

విధులను నిర్వహిస్తే...

విధులను మనం సక్రమంగా నిర్వహిస్తే ఫలితం దానంతటదే వస్తుందని, ఫలితం మనం ఆశించకూడదని గవర్నర్ నరసింహన్ అన్నారు.

స్వామి చెప్పారు...

స్వామి చెప్పారు...

రెండు రాష్ట్రాల సమస్యలను పరిష్కరించి, ప్రజలు సుఖంగా జీవించేలా ఆశీర్వదిస్తానని కూడా స్వామి చెప్పారని, అందుకే ఎలాంటి కష్టాలొచ్చినా ఆపద్బాంధవుడు శ్రీవేంకటేశ్వరుడి దీవెనలతో తొలగిపోతాయని, ప్రజలు సుఖసంతోషాలతో ఉంటారని నమ్ముతున్నానని నరసింహన్‌ వ్యాఖ్యానించారు.

ఆ తర్వాత టిటిడి ఏర్పాట్లపై క్యూలైన్లలోని భక్తులతో గవర్నర్‌ ముచ్చటించారు. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న వివాదాలను ఎలా పరిష్కరిస్తారు? మిమ్మల్ని ధిక్కరిస్తూ మాట్లాడుతున్న నేతల పరిస్థితేంటి? అంటూ మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా.. ‘నేను కర్మయోగాన్ని అనుసరిస్తాను. ఆదివారం యోగాదినం కూడా. మనిషి జీవితం లో మూడు యోగాలు ముఖ్యమని కృష్ణుడు చెప్పారు. అవి కర్మ, జ్ఞాన, భక్తి యోగాలు. వీటిలో ముఖ్యమైనది కర్మయోగం. కర్మ యోగమంటే పని చేయడ మే మన బాధ్యత. దాని ఫలితం ఆశించే అధికారం మనకుండదు. విధులను సక్రమంగా నిర్వహిస్తూపోతే ఫలితం దానంతట అదే వస్తుంది' అని వివరించారు.

ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఏపీ, తెలంగాణ ప్రజలు, నాయకులు సంయమనం పాటించాలని గవర్నర్‌ సూచించారు. అందువల్ల ప్రజలందరూ శాంతియుతంగా ఉండాలన్నదే తన విజ్ఞప్తి అని చెప్పారు. అంతకుముందు ఆయన తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు.

English summary
Governor rejects to comment on controversies netween two states
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X