తిరుమలలో తెలంగాణ గవర్నర్ తమిళసై - కీలక వ్యాఖ్యలు..!!

తెలంగాణ గవర్నర్ తమిళిసై తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం స్వామి వారి వీఐపీ విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు. ముందుగా ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న ఆమెకు టీటీడీ ఈవో ఏవి.ధర్మారెడ్డి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనంతరం వీరికి ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు.

రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలంతా బాగుండాలని శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని కోరుకున్నట్లు గవర్నర్ చెప్పారు. బ్రేక్ సమయంలో మార్పు తీసుకురావడం చాలా మంచి నిర్ణయంమన్నారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చి దేవుని ముందు అందరూ సమానమే అంటూ టీటీడీ తీసుకున్న నిర్ణయం ఆనందదాయకమని ప్రశంసించారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఆహ్వనం లేకపోవడంతోనే అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ,సచివాలయం ప్రారంభోత్సవాలకు హజరు కాలేదని చెప్పారు. ఆహ్వనించామని వారు పేర్కోనడంతోనే తాను ఆహ్వనం అందలేదని చెప్పాల్సి వచ్చిందన్నారు. ఆహ్వనం పంపలేదని తాను ఎవరిని అడగలేదని గవర్నర్ చెప్పుకొచ్చారు.

 tamilasai

తిరుమలలో సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో భాగంగా వీఐపీ బ్రేక్ దర్శనాల సమయంలో టీటీడీ మార్పులు చేసింది. గతంలో ఉన్న సమయాలను మార్చిన తరువాత సామాన్య భక్తులకు దర్శనం లో మేలు జరిగినట్లు టీటీడీ గుర్తించింది. దీంతో, తొలుత ఒక నెల ప్రయోగాత్మకంగా అమలుకు నిర్ణయించిన టీడీపీ ప్రస్తుతం ఇదే విధానం కొనసాగిస్తోంది. ప్రస్తుతం వేసవి సెలవులు కావటంతో తిరుమలలో రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. ఇందుకు తగిన విధంగా జూన్ వరకు వీఐపీ సిఫార్సు లేఖలను తగ్గించాలని నిర్ణయించింది. దీంతో పాటుగా నడక దారి భక్తులకు దివ్య దర్శనం టోకెన్లు జారీ చేస్తోంది. ఇప్పుడు సామాన్య భక్తులకు దర్శనం విషయంలో టీటీడీ తీసుకున్న నిర్ణయాలను గవర్నర్ అభినందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+