డొక్కా సీతమ్మ మధ్నాహ్న భోజనం మెనూ ఖరారు - ఏరోజు ఏంటి..!!
ఏపీ ప్రభుత్వం మధ్నాహ్న భోజనం పథకానికి డొక్కా సీతమ్మ పేరు ఖరారు చేసారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నా క్యాంటీన్లకే ఈ పేరు తొలుత ప్రతిపాదించారు. అయితే, మధ్నాహ్నం భోజనం పథకానికి ప్రభుత్వం తాజాగా ఇప్పటి వరకు అమల్లో ఉన్న జగనన్న గోరు ముద్ద స్థానంలో ఈ పేరు ఖరారు చేసింది. తాజాగా ఈ పథకానికి సంబంధించి రోజు వారి మెనూను ప్రకటించింది. ప్రతీ బడిలోనూ ఈ పథకం కింద అందించే ఆహార పదార్దాలను ఫైనల్ చేసింది.
ఏపీ ప్రభుత్వం అందిస్తున్న డొక్కా సీతమ్మ మధ్నాహ్న భోజనం పథకం కింద ప్రతీ రోజు ప్రత్యేకంగా మెనూను సిద్దం చేసింది. దీని ప్రకారం ప్రతీ సోమవారం కూరగాయల పులావ్, కోడిగుడ్డు కూర, వేరుశనగ - బెల్లం చిక్కి అందించాలని నిర్ణయించారు. మంగళవారం పులిహోర, దొండకాయ పచ్చడి, ఉడికించిన కోడిగుడ్డు, రాగిజావ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. బుధవారం కూరగాయల అన్నం, ఆలూ కూర్మా, ఉడికించిన కోడిగుడ్డు, వేరుశనగ చిక్కి ఇవ్వనున్నారు. గురువారం సాంబార్ బాత్, లెమన్ రైస్, టమోట పచ్చడి ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

ప్రతీ శుక్రవారం అన్నం, ఆకుకూర పప్పు, ఉడికించిన కోడిగుడ్డు, వేరుశనగ - బెల్లం చిక్కి మెనూలో చేర్చారు. ఇక..శనివారం మాత్రం ఆకుకూర అన్నం, పప్పుచార, రాగిజావ, స్వీట్ పొంగల్ తో కూడిన భోజనం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఇదే సమయంలో ప్రధానోపాధ్యాయులు, వంట నిర్వాహకులకు ప్రభుత్వం కొన్ని కీలక సూచనలు చేసింది. శుభ్రమైన వాతావరణంలో వంట చేయటంతో పాటుగా విద్యార్ధులకు నిర్వహణలోనూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. వంటి నిర్వాహకులు యూనిఫాం తప్పనిసరిగా ధరించాలని ప్రభుత్వం సూచించింది.
Dokka Seethamma Mid day Meals Menu for school kids ❤️
— Deputy CM PK (@DeputyCMPK) July 29, 2024
Chief @PawanKalyan took the intiative and succeeded 🙏🔥 pic.twitter.com/yE09FKz3e3












Click it and Unblock the Notifications