జగన్ ముద్ర లేకుండా చంద్రబాబు అడుగులు - అదే అసలు టాస్క్..!!

ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం వ్యూహాత్మక నిర్ణయాలు అమలు చేస్తోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ రూ 4వేలకు పెంచింది. జూలై 1 ఉదయాన్నే ప్రతి ఇంటికీ లబ్ధిని అందించేలా చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఒక్కరోజులోనే మొత్తం 65,18,496 మందికీ పింఛన్లు అందనున్నాయి. జగన్ తన సక్సెస్ గా చెప్పుకున్న పెన్షన్ల పంపిణీ ఇప్పుడు చంద్రబాబు తన మార్క్ గా మార్చుకుంటున్నారు. అక్కడే అసలు చర్చ మొదలైంది.

పంపిణీకి సిద్దం
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం పెన్షన్ల పంపిణీకి అదికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో విశాఖ నగరంలో సచివాలయాల వారీగా నగదు డ్రా చేసి సోమవారం కార్యదర్శులు ఇంటింటికి వెళ్లి పెన్షన్లు అందజేయనున్నారు. 4 వేల రూపాయలతో పాటు ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన ఏరియర్స్ మూడు వేలు కలిపి మొత్తం రూ. 7 వేలు పంపిణీ చేయనున్నారు. ఒక్కరోజులోనే మొత్తం 65,18,496 మందికీ పింఛను అందించడమే లక్ష్యంగా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులను, ఇతర విభాగాల సిబ్బందిని పెద్దఎత్తున రంగంలోకి దించుతున్నారు.

Govt made arrangements to distribute pensions worth Rs 4408 cr to 65 lakh beneficiaries

లబ్దిదారుల ఇంటికి చంద్రబాబు
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పెనుమాక గ్రామంలో జరిగే పంపిణీలో స్వయంగా ముఖ్యమంత్రే పాల్గొనున్నారు. పింఛన్లపంపిణీకి గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందితో పాటు ఇతర విభాగాల సిబ్బంది సేవలను కూడా వినియోగించుకునేలా ఎంపీడీవోలు, మున్సిపల్‌ కమిషనర్లకు ఆదేశాలు జారీ చేయాలని సూచించారు. కూటమి ప్రభుత్వంలో మొదటిసారి పింఛన్ల పంపిణీ అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం అని నిర్లక్ష్యానికి అవకాశం ఇవ్వకుండా సక్రమంగా పంపిణీ చేయాలని ఆదేశించారు.

వైసీపీ వాదన ఇలా
వాలంటీర్ల ద్వారా జగన్ ప్రభుత్వంలో ప్రతీ నెల 1వ తేదీ ఉదయం లబ్దిదారులకు పెన్షన్ అందించేవారు. జగన్ ప్రతీ సభలోనూ ఇది తన సక్సెస్ గా చెప్పుకొనే వారు. ఇప్పుడు చంద్రబాబు వాలంటీర్లతో కాకపోయినా ఇంటి వద్దకే పెన్షన్లు అందిస్తున్నారు. దీని ద్వారా జగన్ ముద్ర లేకుండా చేసేలా రాజకీయంగా అడుగులు వేస్తున్నారు. అయితే..వైసీపీ వాదన మరోలా ఉంది. తాము ప్రారంభించిన విధానం చంద్రబాబు అమలు చేయటం ద్వారా తమ నిర్ణయానికి మద్దతిచ్చారని చెబుతున్నారు. అదే విధంగా కేవలం పెన్షన్లు మాత్రమే కాదని..ఇతర హామీల అమలులోనూ వేచి చూస్తామంటున్నారు. ఏ పథకం అమలు చేయకున్నా..ప్రభుత్వాన్ని నిలదీస్తామని వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. దీంతో, కూటమి ప్రభుత్వం హామీల అమలు నిర్ణయాలపైన ఆసక్తి కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+