పరువు తీశాడు.. కెవిపిని అరెస్ట్ చేయాలి: బాబు లేఖ
హైదరాబాద్/కర్నూలు: పార్లమెంటు సభ్యుడిగా ఉండి టైటానియం కుంభకోణం కేసులో రాష్ట్రం పరువుతీశారని కెవిపి రామచంద్ర రావుపై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కెవిపి వెంటనే అరెస్ట్ చేసి రాష్ట్ర పరువు కాపాడాలని ఆయన కోరారు. ఈ మేరకు కెవిపిని అరెస్ట్ చేయాలని శుక్రవారం రాష్ట్ర గవర్నర ఈఎస్ఎల్ నర్సింహన్‌కు చంద్రబాబు లేఖ రాశారు. ఇలాంటి అవినీతి చరిత్ర గల నేతలను వెంటనే జైలులో పెట్టాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రజలను నడివీధిలో వదిలేసింది
కర్నూలు: రాష్ట్ర విభజన చేపట్టి సీమాంధ్ర ప్రజలను కాంగ్రెస్ నడివీధిలో వదిలేసిందని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కర్నూలు జిల్లాలోని ఆలూరులో నిర్వహించిన రోడ్‌షోలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ఓటు ద్వారా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి బుద్ధి చెప్పాలని, కాంగ్రెస్‌ను భూస్థాపితం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

తాము అధికారంలోకి వచ్చాక సీమాంధ్రను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. హాలహర్వి మండలం గుళ్యం వేదావతి వద్ద ప్రాజెక్టు నిర్మిస్తామని తెలిపారు. హంద్రీనీవా ద్వారా తాగు, సాగు నీరు అందిస్తామన్నారు. రైతు రుణమాఫీ, రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్, వ్యవసాయం కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయిస్తామన్నారు. డ్వాక్రా మహిళలకు రుణ మాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
చంద్రబాబుతోనే సీమాంధ్ర అభివృద్ధి సాధ్యం : తోట వాణి
కాకినాడ: సీమాంధ్రలో అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమని, ఆయన ఒక్కరే సీమాంధ్రకు న్యాయం చేయగలరని తోట వాణి పేర్కొన్నారు. కాకినాడ పార్లమెంట్ టిడిపి అభ్యర్థి తోట నరిసింహం తరఫున ఆయన సతీమణి వాణి జోరుగా ప్రచారం చేస్తున్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. గతంలో నిరహార దీక్ష చేపట్టినప్పుడు కాంగ్రెస్ నుంచి సరైన స్పందన లేదని వాణి పేర్కొన్నారు. దీంతో భార్యభర్తలు ఇద్దరం చాలా బాధపడ్డామని ఆమె అన్నారు. ఆ సమయంలో టీడీపీయే తమకు మద్దతు తెలిపిందని వాణి తెలిపారు.
-
హైదరాబాద్ ను మించి అమరావతి నిర్మాణం చేస్తామన్న సీఎం చంద్రబాబు! -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications