ఏపీలో రోడ్డెక్కుతున్న రైతులు- సర్కారు మద్దతు ఇదేనా అంటూ చంద్రబాబు ట్వీట్
దేశవ్యాప్తంగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు రోడ్డెక్కుతున్న వేళ ఏపీలోనూ అన్నదాతలు క్రమంగా రోడ్డపైకి వస్తున్నారు. అయితే వీరు మొత్తం వ్యవసాయ చట్టాలపై కాకుండా తమకు లభిస్తున్న మద్దతు ధరలు దారుణంగా ఉంటున్నాయనే ఆక్రోశంతోనే. దీంతో రైతుల ఆందోళనల నేపథ్యంలో వ్యవసాయ బిల్లులకు మద్దతిచ్చిన వైసీపీకి సొంత రాష్ట్రంలో రైతుల ఆందోళనకు కూడా ఇబ్బందికరంగా మారాయి. వీటిపై విపక్ష నేత చంద్రబాబు కూడా వైసీపీ సర్కారును ఇరుకునపెడుతూ ట్వీట్ చేశారు.

ఏపీలోని నెల్లూరు జిల్లాలో ఓ వరి రైతు తనకు కనీస మద్దతు ధర లేదంటూ రెండు రోజుల క్రితం రోడ్డుపై నిరసనకు దిగాడు. ఇవాళ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టమోటా రైతు తన పంటకు కనీస ధర లేదంటూ ఆందోళన చేపట్టాడు. దీంతో ఈ రెండు అంశాలను ట్యాగ్ చేస్తూ విపక్ష నేత చంద్రబాబు ఇవాళ ట్వీట్ చేశారు. రైతులకు అండగా ఉంటున్నట్లు చెప్పుకుంటున్న వైసీపీ సర్కారు తీరును ఆయన తన ట్వీట్‌లో ఎండగట్టారు.

Recommended Video
ఇదేనా రైతుకు మీరిస్తున్న మద్దతు అంటూ చంద్రబాబు తన ట్వీట్‌లో వైసీపీ సర్కారును ప్రశ్నించారు. ముందుగానే పంటలకు మద్దతు ధర ప్రకటించి వ్యవసాయాన్ని పండుగలా మార్చేశామని ప్రభుత్వం గాలిమాటలు చెబుతోందని చంద్రబాబు ఆక్షేపించారు. అదే నిజమైతే నెల్లూరులో వరి రైతు, కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టమోటా రైతు రోడ్లపైకి ఎందుకొచ్చారు, పండుగ చేసుకోవడానికా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇదేనా రైతుకు మీరిస్తున్న మద్దతు అంటూ వైసీపీ సర్కారును నిలదీశారు.
-
రాజ్యసభలో అమరావతి బిల్లుపై రూటు మార్చిన వైసీపీ, అనూహ్య డిమాండ్..!! -
AP Govt: ఇక రాష్ట్రమంతా సంజీవని..! చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
ఏపీలోని 13 కార్పోరేషన్లలో డివిజన్ల పెంపు-విజయవాడ, గుంటూరు సహా ఇవే..! -
LPG: ఏపీలో వ్యాపారులకు ఊరట- కమర్షియల్ గ్యాస్ పై సర్కార్ ఉత్తర్వులు..! -
అమరావతికి వ్యతిరేకం కాదు, అయితే.. మా డౌట్ అదే - జగన్ బిగ్ ట్విస్ట్..!! -
ఐఐటీ, నీట్ రాసే ఇంటర్ విద్యార్థులకు లోకేష్ గుడ్ న్యూస్..! -
పేద, మధ్యతరగతి ప్రజలకు బిగ్ షాక్.. ఎన్టీఆర్ వైద్య సేవలు బంద్ !! -
ఇంటర్ మూల్యాంకనం పూర్తి, ఫలితాల డేట్ ఫిక్స్ - ఏపీ.. తెలంగాణలో ఇలా..!! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
మళ్లీ మొదలెట్టావా పాప.. ప్రెగ్నెన్సీ నిజమేనా? -
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..!











Click it and Unblock the Notifications