చంద్రబాబు విజ్ఝప్తికి కేంద్రం ఓకె: స్థానికతకు సై, కండీషన్ ఇదీ...

న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన తర్వాత మూడేళ్లలోపు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చి స్ధిరపడే వారిని స్థానికులుగా గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన విజ్ఞప్తికి కేంద్రం సానుకూలంగా స్పందించింది.

త్వరలోనే స్థానికతకు సంబంధించి రాష్ట్రపతి ఉత్తర్వులు జారీచేసే దిశగా చర్యలు చేపడుతున్నట్లు శనివారం మీడియాలో వార్తలు వచ్చాయి. 2017 జూన్‌ 2వ తేదీలోగా ఆంధ్రప్రదేశ్‌కు వచ్చినవారు ఏ జిల్లాలో స్థిరపడితే ఆ జిల్లాకు చెందిన స్థానికులుగా గుర్తించేందుకు కేంద్ర న్యాయశాఖ పచ్చజెండా ఊపింది. గత ఆరు నెలల నుంచి స్థానికత అంశంపై న్యాయశాఖ, హోం శాఖల మధ్య ఫైలు చక్కర్లు కొడుతూ వచ్చిందని మీడియాలో వార్తలు వచ్చాయి.

మీడియా కథనాల ప్రకారం - ఎట్టకేలకు న్యాయశాఖ తన పని పూర్తి చేసి స్థానికత ఫైలును హోంశాఖకు పంపింది. దీనిని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో)కు పంపితే స్వల్ప కాలంలోనే కేబినెట్‌ ఆమోదానికి వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే ఈ విషయంలో హోంశాఖ తీవ్ర జాప్యం చేస్తోంది. ఫైలును పీఎంవోకు పంపితే దానిపై ప్రధాని సంతకం పెడతారని.. తర్వాత అది మళ్లీ హోంశాఖకు చేరుతుందని, ఆ శాఖ దీనిపై కేబినెట్‌ నోట్‌ను తయారుచేసి మంత్రివర్గం ముందు పెట్టి అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని సమాచారం

Green signal: local issue solved in Andhra Pradesh

విభజన తేదీనుంచి మూడేళ్లలోపు తెలంగాణ నుంచి ఏపీకి వచ్చి స్థిర నివాసం ఏర్పరచుకునే వారికి ఏపీ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా స్థానికత కల్పించాలంటూ గతంలోని రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణ చేపట్టాలని గత ఏడాది అక్టోబర్‌ 9న చంద్రబాబు కేంద్ర హోం శాఖకు లేఖ రాశారు.

ఆయన ఢిల్లీకి వచ్చినప్పుడల్లా హోంమంత్రికి గుర్తు చేస్తున్నా అధికారులు మాత్రం ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. '371-డి'కి చిన్న సవరణ చేయడానికి ఆరు నెలల సమయం తీసుకోవడంపై ఏపీ భవన్‌ అధికారుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోందంటూ ఓ ప్రముఖ దినపత్రిక రాసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+