తాళి కట్టేందుకు నిరాకరణ: పెళ్లనగా వరుడి పరారీ
హైదరాబాద్: రాష్ట్రంలో రెండు విచిత్ర సంఘటనలు చోటు చేసుకున్నాయి. పెళ్లి పీటల మీదికి వచ్చిన తర్వాత రెండు పెళ్లిళ్లు ఆగిపోయాయి. నల్లగొండ జిల్లాలోని చౌటుప్పల్ మండలం జైకేసారంలో బుధవారం ఉదయం 10 నిమిషాల్లో పెళ్లి ఉందనగా పెళ్లికుమారుడు పరారయ్యాడు. దీంతో పీటల మీదే పెళ్లి నిలిపిపోయింది. పెళ్లి కుమారుడి పరారీపై వధువు తరపు బంధువుల ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదిలా వుంటే, వరంగల్ జిల్లాలోని హన్మకొండలో పెళ్లి పీటల మీదే మరో వివాహం నిలిచిపోయింది. వధువు నచ్చలేందంటూ పెళ్లికొడుకు తాళి కట్టేందుకు నిరాకరించాడు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన వధువు బంధువులు పెళ్లికుమారుడిపై దాడి చేశారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పెళ్లికొడుకును అదుపులోకి తీసుకున్నారు.

అంతకు ముందు వధువు తల్లిదండ్రులు పెళ్లి కుమారుడి కాళ్లావేళ్లా పడ్డారు. అయినా అతని మనసు కరగలేదు. దాంతో కుటుంబ సభ్యులతో కలిసి అతన్ని చితకబాదారు. కట్నంగా 18 లక్షల రూపాయలు, 20 తులాల బంగారం ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఈ పెళ్లి మ్యారేజీ బ్యూరో ద్వారా కుదిరినట్లు సమాచారం. వరుడు ప్రదీప్ రెడ్డిది మెదక్ జిల్లా సిద్ధిపేట కాగా, వధువుది వరంగల్ జిల్లా గూడూరు.












Click it and Unblock the Notifications