నిరూపిస్తే - ఆత్మహత్య చేసుకుంటా : నేను బతికుండగా అడుగు పెట్టలేరు- కొడాలి నాని సంచలనం..!!
మంత్రి కొడాలి నాని అడ్డా గుడివాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొని ఉన్నాయి. సంక్రాంతి పండుగ సమయంలో గుడివాడలోని కొడాలి నానికి చెందిన కె-కన్వెన్షన్ సెంటర్ లో క్యాసినో నిర్వహించారంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. దీని పైన టీడీపీ మంత్రిని లక్ష్యంగా చేసుకొని విమర్శలు చేసింది. ఇక, నిజ నిర్దారణ పేరుతో ఈ రోజున టీడీపీ నేతలు గుడివాడ వెళ్లారదు. మంత్రి కొడాలి నానికి చెందిన కే కన్వెన్షన్ సెంటర్ రెండున్నార ఎకరాల్లో ఉంది. దీనిని పరిశీలించటంతో పాటుగా... స్థానికులను ఆరా తీయటానికి టీడీపీ నేతలు వెళ్లారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు.

గుడివాడలో టెన్షన్ సిట్యుయేషన్
అదే సమయంలో వైసీపీ శ్రేణులు టీడీపీ కార్యాలయం పైన రాళ్ల దాడి చేసారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా కారు ధ్వంసం అయింది. పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. ఇక, ఈ సమయంలో మంత్రివర్గ సమావేశంలో పాల్గొన్న కొడాలి నాని ఆ తరువాత దీని పైన స్పందించారు. తనకు చెందిన కే కన్వెన్షన్ సెంటర్ లో క్యాసినో జరిగినట్లు నిరూపిస్తే..తాను పెట్రోలు పోసుకొని ఆత్మహత్య చేసుకుంటానని ప్రకటించారు. నిరూపించలేక పోతే చంద్రబాబు - లోకేష్ ఏం చేస్తారో చెప్పాలని సవాల్ చేసారు.

గుడివాడలో అంత దమ్ము లేదు
గుడివాడలో వాళ్లకు కాలు పెట్టే దమ్ము లేదని మంత్రి చెప్పుకొచ్చారు. అది గుడివాడ అని..తాను బతికుండగా అక్కడ చంద్రబాబుతో సహా ఎవరూ కాలు పెట్టలేరని సంచలన వ్యాఖ్యలు చేసారు. చంద్రబాబుకు గుడివాడలో అడుగు పెట్టే ధైర్యం లేదని..టీడీపీలో ఉండే పకోడీ గాళ్లు నన్ను ఏం స్తారంటూ మంత్రి వ్యాఖ్యానించారు. చంద్రబాబు పైన తీవ్ర ఆరోపణలు చేసారు. తాను గుడివాడలో లేని సమయంలో వీళ్లందరూ కలిసి కట్టుగా కుట్ర చేసారంటూ ఫైర్ అయ్యారు. సంక్రాంతి సమయంలో ఇతర ప్రాంతాల్లో జరిగినట్లుగా కోడి -ఎడ్ల పందాలు జరిగాయని.. తనకు తెలిసిన వెంటనే డీఎస్పీకి ఫోన్ చేసి వాటిని ఆపేయాలని సూచించానని మంత్రి చెప్పారు. ఈ నెల 6వ తేదీ నుంచి తాను గుడివాడలో లేనని చెప్పుకొచ్చారు.

అక్కడ లా అండ్ ఆర్డర్ సమస్య తెచ్చేందుకే
గుడివాడలోకి టీడీపీ వాళ్లను రానివ్వరిని తెలిసే ..ఈ డ్రామా ఆడుతున్నారంటూ మంత్రి పడ్డారు. గుడివాడలో లా అండ్ ఆర్డర్ సమస్య తెచ్చేందుకు ఈ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. క్రిష్ణా జిల్లా టీడీపీ నేతల పైన సంచలన ఆరోపణలు చేసారు. తన మీద ఆరోపణలు నిరూపిస్తూ తాను సచివాలయం వద్దే ఆత్మహత్య చేసుకుంటానని... నిరూపించలేక పోతే ఏం చేస్తారో స్పష్టం చేయాలంటూ చంద్రబాబుకే పదే పదే సవాల్ చేసారు. ఇక, ఇప్పుడు గుడివాడలో పరిస్థితులు.. కొడాలి నాని వ్యాఖ్యలతో ఈ వ్యవహారం మరింత ముదిరే అవకాశం కనిపిస్తోంది.