నైజీరియాలో గుంటూరు జిల్లా వాసి కిడ్నాప్, కుటుంబ సభ్యుల రోదన
హైదరాబాద్: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చింతలపూడికి చెందిన టంగుటూరి శ్రీనివాస్ అనే ఇరవయ్యారేళ్ల వ్యక్తి నైజీరియాలో అపరణకు గురయ్యాడు. ఇది స్థానికంగా కలకలం రేపింది. నైజీరియాలోనే ఉంటున్న చంద్రశేఖర్ అనే వ్యక్తి శ్రీనివాస్ రావు తండ్రి శేషయ్యకు ఈ సమాచారం అందించారు.
కుటుంబ సభ్యుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన శేషయ్య, నాగమణిల కుమారుడు శ్రీనివాస రావు నైజీరియాలో గత రెండున్నర సంవత్సరాలుగా లెబసీమెరిడ్ సైట్ ఎక్విడెంట్ కంపెనీలో అకౌంటెంట్‌గా పని చేస్తున్నాడు. నైజీరియాలో ఉన్న వారి బంధువు చంద్రశేఖరరావు ద్వారా ఉద్యోగంలో చేరాడు.
శ్రీనివాసరావుకు గుంటూరుకు చెందిన యువతితో వివాహ నిమిత్తం అక్టోబర్ 20న నిశ్చితార్థం కోసం చింతలపూడి వచ్చాడు. అక్టోబర్ 30న తిరిగి నైజీరియా వెళ్ళాడు. నవంబర్ 2న ఉద్యోగంలో చేరినట్లు ఫోను ద్వారా సమాచారం అందించాడు.

గత వారం రోజులుగా అతడి నుండి ఎలాంటి సమాచారం లేదు. దీంతో ఆందోళనకు గురైన తల్లిదండ్రులు తమ బంధువైన నైజీరియాలోనే ఉంటున్న చంద్రశేఖర్‌ను ఫోనుద్వారా సంప్రదించగా శ్రీనివాసరావు కిడ్నాప్ అయ్యాడని, ఎవరు, ఎందుకు కిడ్నాప్ చేశారనే విషయం తెలియరాలేదన్నారు. శ్రీనివాసరావు కిడ్నాప్ విషయం తెలిసిన తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.
శ్రీనివాస రావు కొంతకాలం బెంగళూరులో ప్రయివేటు కంపెనీలో పని చేశారు. అక్కడి నుండి నైజీరియాలోని బయాలసా రాష్ట్రంలోని ఎన్నెగూవ పట్టణంలో లెజెన్సీ మేరిడ్ నైజీరియా లిమిటెడ్ అనే కంపెనీలో నిర్మాణ శిబిరంలో సైట్ ఎక్విటెంట్‌గా పని చేస్తున్నాడు.
బుధవారం రాత్రి శ్రీనివాస రావు మరో ఇద్దరు పాకిస్తానీయులు వారికి కేటాయించిన క్వార్టర్లలో ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి అపహరించారు. వీరి గన్‌మెన్లు ఉన్నప్పటికీ కిడ్నాప్ జరిగింది. శ్రీనివాస రావు పని చేసే కంపెనీ యజమాని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. డబ్బులు అడిగితే ఇచ్చి విడిపిచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు.












Click it and Unblock the Notifications