బైక్‌పై నుంచి కిందపడ్డ ఎంపీ గల్లా జయదేవ్: అపోలో ఆసుపత్రిలో చికిత్స
హైదరాబాద్: గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌కు పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్‌లో బైక్‌పై నుంచి కిందపడటంతో ఆయనకి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్ధానికంగా ఉన్న అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
గల్లా జయదేవ్ తన కుమారుడి కోసం కొత్త బైక్ కొని ట్రయల్స్ వేసి చూస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌కు ఎలాంటి ప్రమాదం లేదని అపోలో వైద్యులు తెలిపారు.

ప్రమాదంలో చిన్న దెబ్బ తగలడంతో ఆయన వెన్నుముకకు మాత్రమే గాయమైందని సమాచారం. బైక్‌పై నుంచి ఒక్కసారిగా కిందకు పడిపోయారు.












Click it and Unblock the Notifications