• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

మరణించిన అమ్మను...ఏడాది తరువాత మళ్లీ చూశాడు...ఇది నిజంగా విచిత్రమే...

|

గుంటూరు: ఆమె కొడుకును ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేసింది. అతడు కూడా అమ్మను బాగా చూసుకునేవాడు...కాలం గడిచింది...తల్లి వృద్దాప్యంతో మరణించింది...తల్లి చనిపోవడంతో ఆమె జ్ఞాపకాలు స్మరించుకుంటూ కాలం గడుపుతున్నాడు...అలాంటి సమయంలో అతడు అస్సలు ఊహించనివిధంగా మళ్లీ తన తల్లిని చూశాడు...నమ్మశక్యంగా లేదు కదా?...అయినా ఇది నిజం...అదెలాగంటే...

తల్లి చనిపోయి సరిగ్గా ఏడాదైంది...అమ్మ అంటే ఎంతో ప్రేమ ఉన్న అతడు ఆమెని గుర్తుకు తెచ్చకోకుండా ఉండలేడు... తన మాతృమూర్తి చిత్రపటాలు, ఆమె పంచిన అమృతలాంటి జ్ఞాపకాలు ఇవే గుర్తులుగా మిగిలాయి...అలాంటి తరుణంలో అతడికి అస్సలు ఊహించని విషయం తెలిసింది. మీ అమ్మ అక్కడుందని ఎవరో చెప్పారు. అంతే ఇంక ఒక్క క్షణం కూడా ఆలస్యం చెయ్యలేదు. వెంటనే అక్కడకు వెళ్లాడు. నిజంగానే తన అమ్మని అక్కడ చూశాడు...ఇదెలా సాధ్యమైందంటే...

Guntur: The mother raised her son

తల్లిని చూడగలిగాడు...

గుంటూరు జిల్లా యడ్లపాడులోని ఎర్రచెరువుకు చెందిన కేతు వెంకాయమ్మ (85) కు చెందిన గతేడాది డిసెంబర్ 20 వ తేదీన అనారోగ్యంతో కన్నుమూసింది. ఆమె మరణానంతరం కొడుకు రామబ్రహ్మం తల్లి మృతదేహాన్ని వైద్య పరిశోధనల నిమిత్తం కాటూరి మెడికల్‌ కళాశాలకు అప్పగించారు. ఆ తర్వాత ఏమి జరిగిందో అతడికి తెలియదు. అయితే కరెక్ట్ గా ఏడాది గడిచాక అదే డిసెంబర్ 20 న అతడికి ఒక విషయం తెలిసింది. కాటూరి ఆస్పత్రి ఆవరణలో మీ తల్లి మృతదేహం కనిపించిందని, వైజ్ఞానిక ప్రదర్శన లో భాగంగా ఆమె శరీరాన్ని ఆస్పత్రి ఆవరణంలో ఉంచారని చూసినవారు చెప్పడంతో అతడు ఆనందాశ్చర్యాలకు లోనయ్యాడు. వెంటనే కాటూరి వైద్యశాలకు వెళ్లాడు. అక్కడ తన మాతృమూర్తి భౌతికకాయాన్ని మనసారా చూసుకున్నాడు. ఆమె తనను పెంచిన జ్ఞాపకాలు నెమరువేసుకుంటూ చెమర్చిన కళ్లతో తల్లిని చూశాడు...మదినిండా ఆమె రూపాన్ని పున:ప్రతిష్టించుకొని కన్నీళ్లను తుడుచుకుంటూ వెనుతిరిగాడు...

వైజ్ఞానిక ప్రదర్శన వల్లే...తల్లిని మళ్లీ చూడగలిగాడు...

కాటూరి వైద్యశాలలో ఈ నెల 17 నుంచి 21వ తేదీ వరకు వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహిస్తున్నారు. అక్కడకు వెళ్లిన అనేక మంది రామబ్రహ్మం తల్లి భౌతికకాయాన్ని చూసి గుర్తు పట్టారు. వెంటనే కొడుకు రామబ్రహ్మంకు చెప్పడంతో మంగళవారం ఆయన ఆస్పత్రికి వెళ్లి తల్లి భౌతికకాయాన్ని చూసుకున్నారు. ఆనందంతో తల్లి ప్రేమను మరొక్కసారి గుర్తు చేసుకున్నాడు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Guntur: The mother raised her son. He is also a very love kind of man at his mother . The time has passed ... She died of eloquence ... the mother dies and remembers her memories with son... suddenly Katuri Hospital is organizing a scientific exhibition from 17th to 21th of this month. Many of those who went there and they saw there the mother of Ramabrahmam dead body. This news reached to the son Ramabrahmam, he went to the hospital on wednesday and found the mother's body.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more