రాయలసీమకు కేంద్రం గుడ్ న్యూస్

గుంటూరు-గుంతకల్లు మధ్య రెండో రైల్వే లైన్‌ నిర్మాణం శరవేగంగా సాగుతోంది. విద్యుదీకరణలో భాగంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలోని మునుమాక నుంచి నరసరావుపేట మీదుగా సాతులూరు వరకు 16.6 కిలోమీటర్ల లైన్ పూర్తయింది. దీంతో గుంటూరు నుంచి ప్రకాశం జిల్లాలోని జగ్గంభొట్ల కృష్ణాపురం వరకు 176 కిలోమీటర్ల రెండో లైన్‌, విద్యుదీకరణ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి.

2016-17లో గుంటూరు-గుంతకల్లు మధ్య 401 కిలోమీటర్ల రెండో లైన్‌ నిర్మాణం, విద్యుదీకరణ ప్రాజెక్ట్‌ మంజూరైంది. ఇప్పటి వరకు నల్లపాడు-సాతులూరు మధ్య 32 కిలోమీటర్లు, మునుమాక-జగ్గంభొట్ల కృష్ణాపురం మధ్య 122 కిలోమీటర్లు, డోన్‌-గుంతకల్లు మధ్య 68 కిలోమీటర్లు, బేతంచెర్ల-మల్కాపురం మధ్య 23 కిలోమీటర్లు కలిపి 245 కిలోమీటర్ల లైన్ నిర్మాణం పూర్తయింది. తాజాగా మునుమాక-సాతులూరు మధ్య రెండోలైన్ పూర్తికావడంతో 261.6 కిలోమీటర్ల ట్రాక్ అందుబాటులోకి వచ్చింది. రైళ్ల వేగాన్ని పెంచేందుకు, కొత్త రైళ్లు నడిపేందుకు, రాయలసీమ జిల్లాల నుంచి అమరావతివైపు, విజయవాడ, విశాఖపట్నం, కోల్ కతాకు మరిన్ని రైళ్లు అందుబాటులోకి వచ్చినట్లవుతుంది.

guntur to guntakal railway doubling project updates

రెండోలైను నిర్మాణంవల్ల ప్రయాణ సమయం ఆదా అవుతుంది. రాయలసీమకు ఎంతో ప్రయోజనం కలగనుంది. గూడ్స్ రైళ్ల ద్వారాఆదాయం పెరుగుతుంది. చెన్నై-కోల్ కతా రైలు మార్గానికి ప్రత్యామ్నాయంగా ఈ లైన్ పనిచేస్తుందంటున్నారు. గుంటూరు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం నాలుగు జిల్లాల మీదుగా ఇది వెళుతుంది కాబట్టి రైల్వేకు భారీగా ఆదాయం పెరగనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+