మంత్రి రజనీ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది..!!
ఏపీలో ఎన్నికల పోరు కీలక దశకు చేరింది. ప్రతీ నియోజకవర్గంలో పోటీ హోరా హోరీగా మారుతోంది. ప్రచారం చివరి మూడు రోజులు పార్టీల అధినేతలు మరింత తీవ్రతరం చేసారు. గెలుపు పైన ధీమా వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో ఓటర్లను ఆకట్టుకొనేందుకు చివరి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అమరావతి పరిధిలోని నియోజకవర్గాల్లో గెలుపు పైన కూటమి, వైసీపీ మధ్య పోటీ నెలకొంది. గుంటూరు పశ్చిమ నియోజవకర్గంలో పోటీ ఆసక్తి కరంగా కనిపిస్తోంది.
మారుతున్న లెక్కలు
గుంటూరు పశ్చిమంలో ఈ సారి ఎన్నికలు కొత్త సమీకరణాలకు కారణమవుతున్నాయి. ఈ నియోజకవర్గంలో ఇద్దరు బీసీ మహిళలు పోటీ పడుతున్నారు. మంత్రి విడదల రజనీ వైసీపీ అభ్యర్దిగా తొలి జాబితాలోనే ఖరారయ్యారు. అనేక తర్జన భర్జనల తరువాత టీడీపీ నుంచి మాధవి పేరు ప్రకటించారు. అయితే, అప్పటికే టీడీపీ..జనసేన నుంచి పెద్ద సంఖ్యలో ఆశావాహులు సీటు కోసం పోటీ పడ్డారు.

రాజకీయాలకు పూర్తిగా మాధవి కొత్త కావటంతో టీడీపీ నేతల సహకారం పైనే ఆధార పడాల్సి వస్తోంది. టీడీపీ అభ్యర్ది ప్రకటన సమయంలో చోటు చేసకున్న పరిణామాలతో టీడీపీ నేతలు ప్రస్తుత కీలక సమయంలో ఆ పార్టీ అభ్యర్దితో అంటీ ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. జనసేన నేతలు అతంత మాత్రంగానే సహకారం అందిస్తున్నారు.
రజనీకి కలిసొచ్చేనా
వైసీపీ అభ్యర్ది రజనీ పరిస్థితి భిన్నంగా ఉంది. టీడీపీ అభ్యర్దికి ప్రకటనకు ముందే నియోజకవర్గంలో రజనీ సుడిగాలి పర్యటన చేసారు. తమ పార్టీ సంక్షేమ ఓట్ బ్యాంక్ తో పాటుగా సామాజిక సమీకరణాల ఆధారంగా తొలి నుంచి ప్రణాళికా బద్దంగా ప్రచారం చేస్తున్నారు. పూర్తిగా అర్బన్ ప్రాంతం కావటంతో స్థానిక పరిస్థితులకు అనుగుణంగా తన వ్యూహాలు మార్చుకున్నారు.
ప్రధానంగా తటస్తుల ఓటర్లను తన వైపు తిప్పుకోవటానికి ప్రాధాన్యత ఇచ్చారు. కూటమిలో మూడు పార్టీల మధ్య సమన్వయలేమి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఆ పరిస్థితిని రజనీ తనకు అనుకూలంగా మలచుకుంటున్నారు. నియోజకవర్గంలో స్థానిక సమస్యల పరిష్కారం పైన హామీలు ఇస్తున్నారు. మహిళాఓట్ బ్యాంక్ వైసీపీకి అనుకూలంగా ఉన్నారనే నమ్మకంతో మరింతగా వారితో మమేకం అవుతున్నారు.

గెలుపు దక్కేదెవరికి
సంక్షేమ పథకాల లబ్దిదారులు సామాజిక వర్గాల వారీగా ముఖ్యులతో రజనీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా వైసీపీ మేనిఫెస్టోలో ప్రకటించి సంక్షేమ పథకాల అమలు క్యాలెండర్ ప్రకటించటంతో లబ్దిదారుల్లో సానుకూల సంకేతాలు కనిపిస్తున్నాయనే వాదన ఉంది. దీంతో..చివరి మూడు రోజుల పర్యటన పైన రజనీ ఫోకస్ చేసారు.
వార్డుల వారీగా ఎలక్షనీరింగ్ బాధ్యతలు అప్పగించారు. పార్టీకి సానుకూలంగా ఉన్న ఓటింగ్ ను మరింత బలోపేతం చేసుకోవటం పైన రజనీ వ్యూహత్మకంగా వ్యవహరిస్తున్నారు. అటు టీడీపీ మాధవి కి ఇదే సమయంలో టీడీపీ ముఖ్యుల నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందకపోవటం ఆ పార్టీలో టెన్షన్ కు కారణమవుతోంది. దీంతో..రజనీ తన గెలుపు పైన ధీమాగా ఉన్నారు.












Click it and Unblock the Notifications