జీవీఎంసీ కమిషనర్ సృజన ట్వీట్ కలకలం-వైసీపీ నేతలతో వార్ నేపథ్యం-ఏం జరుగుతోంది ?
ఏపీలో మూడు రాజధానులు తెరపైకి వచ్చాక విశాఖకు పెరిగిన ప్రాధాన్యత ఇప్పుడు అక్కడ వైసీపీ నేతలకు వరంగా మారింది. ప్రభుత్వ నిర్ణయాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అక్కడి నేతలు పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలో అదికారుల్ని కానీ, వారి నిర్ణయాల్ని కానీ లెక్క చేసే పరిస్ధితులు కనిపించడం లేదు. ఇదే క్రమంలో తాజాగా వైసీపీ నేతలకూ, జీవీఎంసీ కమిషనర్ సృజనకూ మధ్య వార్ మొదలైంది. తమ ఆధిపత్యం సాగనివ్వడం లేదనే అక్కసుతో ఆమెపై ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ ఛార్జ్ విజయసాయిరెడ్డికి వారు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఆమె చేసిన ట్వీట్ సంచలనం రేపుతోంది.

విశాఖ రాజధాని ఎఫెక్ట్
ఏపీలో వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల ప్రక్రియలో భాగంగా విశాఖకు కార్యనిర్వాహక రాజధానిని ఇచ్చింది. అంటే మూడు రాజధానుల్లో అసలు రాజధాని విశాఖే అన్నమాట. దీంతో సహజంగానే రాజధాని రాకముందే అక్కడ పాగా వేయాలని నిర్ణయించుకున్న అధికార వైసీపీ నేతలు తమ మాట చెల్లుబాటు కావాలని కోరుకుంటున్నారు. కానీ వేగంగా అభివృద్ధి చెందుతూున్న నగరం కావడం, అక్రమాలకు ఊతమిస్తే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్న భావనతో జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు వీరికి బ్రేకులు వేస్తూ వస్తోంది. అయినా వారు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పుడు ఏకంగా అధికారులతో నేరుగా వార్ కే దిగుతున్నారు.

విశాఖలో వైసీపీకి సృజన బ్రేకులు
విశాఖలో తాజాగా కార్పోరేషన్ ఎన్నికలు జరిగాయి. వీటిలో వైసీపీ అత్యధిక సీట్లు కైవసం చేసుకుని విజేతగా నిలిచింది. దీంతో తాజాగా ఎన్నికైన కార్పోరేటర్లు కొందరు వార్డు సచివాలయాలను అడ్డాగా చేసుకుని సిబ్బందికి ఆదేశాలివ్వడం.. గంటల పాటు సమీక్షలు నిర్వహించడం చర్చగా మారుతోంది. వైసీపీ ప్రజాప్రతినిధుల తీరు చూసిన విపక్ష కార్పోరేటర్లు కూడా అదే బాట పడుతూున్నారు. దీంతో ఈ వ్యవహారంపై కమిషనర్ సృజన దృష్టిసారించారు. నేరుగా ప్రభుత్వ పెద్దలకే ఫిర్యాదు చేశారు. దీంతో వారి నుంచి అందిన సూచనల ఆధారంగా సృజన కీలక చర్యలు చేపడుతున్నారు కార్పొరేటర్లు నేరుగా సమీక్షలు చేస్తే హాజరుకావొద్దని.. అలాంటి వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దీంతో కమిషనర్ తీరుపై వారంతా గుర్రుగా ఉన్నారు.

జీవీఎంసీ కమిషనర్ సృజనతో వార్
విశాఖలో ప్రతీ విషయంలోనూ తమ మాట చెల్లుబాటు కావాలని కోరుకుంటున్న కొందరు వైసీపీ నేతలు తాజాగా జీవీఎంసీ కమిషనర్ గా ఉన్న సృజన తీరుపై మండిపడుతున్నారు. తమ స్పీడ్ కు ఆమె బ్రేకులు వేయడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతో కమిషనర్ సృజన తీరుపై వారు ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ ఛార్జ్ గా ఉన్న ఎంపీ విజయసాయిరెడ్డికి ఫిర్యాదులు చేస్తున్నారు. ఇలా ఫిర్యాదులు చేస్తున్న వారి జాబితాలో మంత్రులు కూడా ఉన్నారు. భీమిలి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి అవంతి శ్రీనీవాస్ కూడా సృజన తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. దీంతో వైసీపీ వర్సెస్ కమిషనర్ సృజనగా అక్కడి వార్ మారిపోయింది.
సృజన గుమ్మళ్ల ట్వీట్ కలకలం
విశాఖలో వైసీపీ కార్పోరేటర్లు, ఇతర నేతల జోరుకు బ్రేకులు వేస్తున్న కమిషనర్ సృజన ఇవాళ ఓ ట్వీట్ చేశారు. ఇందులో ఆమె ప్రస్తావించిన అంశాలు కలకలం రేపాయి. ఇందులో "ధీరులు ధర్మంగా ఉండాలని, వీరులు పని చేయాలని, తలెత్తుకుని ఉండాలని, భయపడకూడదని, ఏది కచ్చితమైన పనో దాని కోసం ధైర్యంగా నిలిచేలా, ధర్మాన్ని కాపాడేలా శక్తినిచ్చినందుకు దైవానికి కృతజ్ఞతలు" అంటూ సృజన ట్వీట్ చేశారు. ఈ డైలాగులు ఆమె ఎవరిని ఉద్దేశించి చేశారన్న దానిపై ఇప్పుడు విశాఖలో పలు ఆసక్తికరమైన చర్చలు జరుగుతున్నాయి. తనను నిత్యం టార్గెట్ చేస్తున్న వైసీపీ నేతల్ని ఉద్దేశించే సృజన ఈ ట్వీట్ చేసి ఉంటారన్న ప్రచారం జరుగుతోంది. ఏదేమైనా వైసీపీ నేతలు తనను టార్గెట్ చేస్తున్న క్రమంలో సృజన చేసిన ట్వీట్ సంచలనం రేపుతోంది. దీనిపై వైసీపీ పెద్దలు ఏం చేస్తారో చూడాలిక.
-
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్












Click it and Unblock the Notifications