ఆరోగ్యం, ఆనందం, ఆదాయం: దుర్గమ్మ తల్లిని ప్రార్థించిన చంద్రబాబు
Happy New Year 2025: కొత్త ఏడాది ఆరంభమైంది. 2025లోకి అడుగు పెట్టాయి ప్రపంచదేశాలు. ఒక్కో దేశం ఒక్కో విధంగా నూతన సంవత్సర వేడుకలను జరుపుకొంటోన్నాయి. అర్ధరాత్రి 12 గంటల వరకు కోట్లాదిమంది మేల్కొనే ఉన్నారు. కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొన్నారు.
కొత్త ఏడాదిని పురస్కరించుకుని భక్తులు ఆలయాలను సందర్శిస్తోన్నారు. పుణ్యస్నానాలను ఆచరిస్తోన్నారు. ఈ క్రమంలో గడ్డ కట్టించే చలిని సైతం లెక్క చేయట్లేదు. తెల్లవారు జాము నుంచే గుడుల ముందు బారులు తీర్చి నిల్చొన్నారు. భక్తి శ్రద్ధలతో పూజలను నిర్వహిస్తోన్నారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. తిరుమల, శ్రీకాళహస్తి, శ్రీశైలం, కాణిపాకం, వేములవాడ, భద్రాచలం వంటి ఆలయాలు భక్తుల రద్దీతో నిండిపోయాయి. తెల్లవారు జాము నుంచే ఆలయాల ముందు బారులు తీరి నిల్చున్నారు జనం. ఈ ఏడాదంతా శుభం కలగాలంటూ భగవంతుడిని ప్రార్థిస్తోన్నారు.
కొత్త ఏడాదిని పురస్కరించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన దుర్గా మల్లేశ్వర స్వామివార్లను దర్శించుకున్నారు. కనక దుర్గమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలను నిర్వహించారు. ఆ సమయంలో ఆయన వెంట హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, విజయవాడకు చెందిన సీనియర్ టీడీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఉన్నారు.
ఆలయానికి వచ్చిన చంద్రబాబును అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం వేదమంత్రోచ్ఛారణలతో ఆశీర్వచనాలను పలికారు. అమ్మవారి చిత్రపటాన్ని, తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం చంద్రబాబు అక్కడే విలేకరులతో మాట్లాడారు.
నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు. దుర్గమ్మ ఆశీస్సులతో అందరికీ ఆరోగ్యం, ఆనందం, ఆదాయం సమకూర్చే లక్ష్యంతో మా ప్రభుత్వం పనిచేస్తోంది.#HappyNewYear2025#ChandraBabuNaidu#AndhraPradesh pic.twitter.com/YM6P6PT6vE
— Telugu Desam Party (@JaiTDP) January 1, 2025
ఈ కొత్త సంవత్సరంలో రాష్ట్రంలో అందరూ ఆనందంగా, సుఖసంతోషాలతో ఉండేలా కనకదుర్గమ్మ అమ్మవారు ఆశీర్వదిస్తోన్నారని అన్నారు. దుర్గమ్మ ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలందరికీ ఆరోగ్యం, ఆనందం, ఆదాయం సమకూర్చాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని చంద్రబాబు చెప్పారు.
ఈ సంవత్సరం రాష్ట్రానికి అన్ని విధాలుగా శుభం జరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. అందరి భవిష్యత్తు బంగారుమయం కావాలని దుర్గమ్మ తల్లిని ప్రార్థించానని అన్నారు. అన్ని రంగాల్లోనూ తెలుగువాళ్లకు విజయాలు దక్కాలని, శుభాలు కలగాలని, మేలు జరగాలని కోరుకున్నానని చెప్పారు.
-
మార్కాపురం బస్సు ప్రమాదం..సీఎం చంద్రబాబు,లోకేష్ తో పాటు మంత్రుల దిగ్భ్రాంతి -
ఇకపై రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం












Click it and Unblock the Notifications