వైసీపీలోకి హరిరామ జోగయ్య కుమారుడు - ఏం జరుగుతోంది..!!

ఏపీ ఎన్నికల రాజకీయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. పవన్ కల్యాణ్ 24 సీట్లు తీసుకోవటం పైన ఆగ్రహం వ్యక్తి చేసిన సీనియర్ కాపు నేత హరిరామ జోగయ్య కుమారుడు సూర్య ప్రకాశ్ వైసీపీలో చేరుతున్నారు. జనసేన పీఏసీ సభ్యుడిగా ఉన్న చేగొండి సూర్యప్రకాశ్ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. కొద్ది రోజులుగా పవన్ కు హరిరామ జోగయ్య రాసిన లేఖలు సంచలనంగా మారాయి.

ఈ సమయంలో ఆయన కుమారుడు వైసీపీలో చేరటం చర్చనీయాంశంగా మారుతోంది. పవన్ కు తొలి నుంచి తాను మద్దతు దారుగా హరి రామ జోగయ్య ఉన్నారు. పలు సందర్భాల్లో పవన్ కు మద్దతు ఇస్తూ లేఖలు రాసారు. కాపు ఉద్యమం కోసం పలు డిమాండ్లు చేసారు. న్యాయస్థానంలో కేసులు వేసారు. పవన్ సీఎం అవ్వాలనేది తన కోరికగా చెప్పుకొచ్చారు. పవన్ 40 సీట్లు తక్కువ కాకుండా పొత్తులో తీసుకోవాలంటూ లేఖలు రాసారు. పవన్ 24 సీట్లు తీసుకోవటం పైన ఘాటుగా స్పందించారు. జనసేన సత్తా ఇంతేనా అంటూ ప్రశ్నించారు. పవన్ నిర్ణయంతో జనసైనికుల్లో ఆందోళన వ్యక్తం అవుతుందని..పవన్ అధికారంలో వాటా గురించి చంద్రబాబు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేసారు.

Hari Ram Jogiah Son,Janasena PAC member Surya Prakash to join in YSRCP

తాడేపల్లి గూడెంలో జరిగిన సభలోనే దీని పైన స్పష్టత కోరారు. అయితే, ఆ సభలో పవన్ కల్యాణ్ తనకు ఎవరూ సలహాలు ఇవ్వద్దంటూ గట్టిగా రియాక్ట్ అయ్యారు. దీంతో తాను చెప్పినది చంద్రబాబ, పవన్ కు నచ్చలేదంటూ జోగయ్య మరో లేఖ రాసారు. ఈ రోజు రాసిన తాజా లేఖలో పవన్ కు చంద్రబాబు గురించి హెచ్చరికలు చేసారు. ఇలా లేఖలు రాస్తున్న సమయంలోనే ఇప్పుడు ఆయన కుమారుడు చేగొండి సూర్య ప్రకాష్ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో దర్శనమిచ్చారు. వైసీపీలో చేరుతున్నారు. పార్టీలో చేరిన తరువాత తన తండ్రి లేఖలు..తాను జనసేన వీడి వైసీపీలో చేరటం పైన స్పష్టత ఇచ్చే అవకాశం కనిపిస్తోంది

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+