చాలా రోజుల తర్వాత టిడిపి భేటీలో హరికృష్ణ, ఆరో స్థానంపై బాబు డైలమా
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణ ఆదివారం నాడు పార్టీ పొలిట్ బ్యూరో సమావేశానికి హాజరయ్యారు. ఆయన చాలా రోజుల తర్వాత సమావేశానికి వచ్చారు.
విజయవాడ: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నందమూరి హరికృష్ణ ఆదివారం నాడు పార్టీ పొలిట్ బ్యూరో సమావేశానికి హాజరయ్యారు. ఆయన చాలా రోజుల తర్వాత సమావేశానికి వచ్చారు.
ముఖ్యమంత్రి, టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో పొలిట్ బ్యూరో సమావేశమయింది. ఈ భేటీకి హరికృష్ణ హాజరయ్యారు. సమయం వచ్చినప్పుడల్లా చంద్రబాబు పైన, టిడిపి పైన ఆయన అసంతృప్తి వ్యక్తం చేసిన సందర్భాలు తెలిసిందే.

కాగా, ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. దీనిపై టిడిపి పొలిట్ బ్యూరోలో చర్చిస్తున్నారు. అయిదు ఎమ్మెల్సీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. ఆరో చోట అభ్యర్థిని నిలబెట్టే అంశంపై డైలమాలో ఉన్నారు.












Click it and Unblock the Notifications