బాబు ఆటలు సాగవ్: హరీష్, అడ్డుకుంటే: యాష్కీ వార్న్

నిజామాబాద్ జిల్లా గాంధారి, మెదక్ జిల్లా సిద్దిపేటలోనూ సోమవారం ఆయన మాట్లాడుతూ టిడిపిలోని తెలంగాణ నాయకులు ఇకనైనా కళ్లు తెరిచి చంద్రబాబు వ్యవహార శైలిని గుర్తెరగాలన్నారు. అతన్ని నమ్మి బలి పశువులు కావొద్దని సూచించారు. బాబు జపం మాని తెలంగాణ ప్రజల ఆకాంక్షను చాటాలన్నారు. లేకుంటే చరిత్రహీనులుగా మారుతారని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆపడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్న బాబును భగవంతుడు కూడా క్షమించడని అన్నారు.
తెలంగాణను అడ్డుకుంటున్న సీమాంధ్ర నాయకుల భరతం పట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. చంద్రబాబు కాంగ్రెస్ ఏజెంటుగా మారాడని హరీశ్ ఆరోపించారు. గతంలో ప్రభుత్వంపై తెరాస అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం పెట్టగా, టిడిపి కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చి కాపాడిందని గుర్తు చేశారు. సోనియా తెలంగాణ రాష్ట్రం ప్రకటించినందుకు తెరాసను కాంగ్రెస్‌లో విలీనం చేయాలని కోరే హక్కు టిడిపికి లేదన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఏజెంటులా వ్యవహరిస్తున్నారని, తోక పార్టీగా మారారని దుయ్యబట్టారు.
చంద్రబాబు సమైక్యవాది అని గాలి ముద్దుకృష్ణమ నాయుడు, బాబు లేఖ ఇవ్వడం వల్లనే రాష్ట్ర విభజన జరుగుతోందని ఆ పార్టీ టిటిడిపి నేతలు మోత్కుపల్లి, ఎర్రబెల్లి అంటున్నారని, వాటిలో ఏది నిజమో చెప్పాలన్నారు. టిడిపి తెలంగాణ నాయకులకు ఇప్పటికైనా ఆత్మగౌరవముంటే, వారు ఈ ప్రాంత బిడ్డలైతే వెంటనే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణను అడ్డుకుంటామని సీమాంధ్ర నాయకులు చెప్పడం దింపుడు కల్లం ఆశ అని చెప్పారు. ఫిబ్రవరిలో తెలంగాణ బిల్లు పార్లమెంటులో ఆమోదం ఖాయమన్నారు.
అడ్డుకుంటే ఏమవుతుందో తెలుసా: యాష్కీ
సీమాంధ్ర నాయకులు సమన్యాయం ముసుగులో విభజన అడ్డుకునే ప్రయత్నాలు చేయవద్దని ఎంపి మధుయాష్కీ హెచ్చరించారు. నోటికాడికి వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని ఇప్పుడు అడ్డుకుంటే సీమాంధ్ర పాలకులు, వ్యాపారుల బతుకులు ఏమై పోతాయో తెలుసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications