గుర్తొచ్చినప్పుడు పవన్ ప్రెస్‌మీట్, హైద్రాబాద్‌లో ఆంధ్రొళ్లపై చిన్నచూపు: హర్ష, డోంట్ టచ్ అన్నందుకే: జగన్

హైదరాబాద్: జనసేన పార్టీ అధ్యక్షులు, పవర్ స్టార్ కళ్యాణ్ తనకు గుర్తు వచ్చినప్పుడు ప్రెస్ మీట్‍ పెట్టే వ్యక్తి అని మాజీ పార్లమెంటు సభ్యులు హర్ష కుమార్ మంగళవారం ఎద్దేవా చేశారు. హైదరాబాదులో ఆంధ్రావారిని చిన్నచూపు చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం తాము తమ పార్టీ అధిష్టానాన్నే (కాంగ్రెస్ పార్టీని, సోనియా గాంధీని) ఎదిరించామని ఆయన గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రస్తుతం విపత్కర పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

Harsha Kumar satire on Pawan Kalyan press meet

భూమాను పరామర్శించిన జగన్

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం కర్నూలు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భూమా నాగిరెడ్డిని పరామర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా భూమా పైన అధికార పార్టీ అండదండలతో కేసులు నమోదు చేశారన్నారు. ఏపిలోని టీడీపీ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు.

తన కూతురిని దుర్భాషాలు ఆడితే తండ్రిగా భూమా నాగిరెడ్డి స్పందించారన్నారు. దీంతో భూమాను పక్కకు నెట్టేశారని, అప్పుడు తనను నెట్టవద్దంటూ డోంట్ టచ్ మీ అన్నారని, ఆ పదాన్ని తీసుకొని భూమాపై కేసు పెట్టారన్నారు.

రాష్ట్రపతిని కలిసిన ఏపీ మంత్రులు

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆంధ్రప్రదేశ్ మంత్రులు బుధవారం నాడు కలిశారు. ఫోన్ ట్యాపింగ్, ఓటుకు నోటు, సెక్షన్ 8 తదితర అంశాల పైన ఆయనకు ఫిర్యాదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+