మా ప్రభుత్వాన్ని కూలుస్తాం: టీపై ఎంపి హర్ష కుమార్

ఆదివారంనాడు ఆయన అమలాపురంలో మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ప్రస్తుత ఎన్నికల ఫలితాల పరిస్థితి చూస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులుండవని, కనీసం డిపాజిట్లు కూడా దక్కించుకునే అవకాశాలు కన్పించడం లేదని అన్నారు. ఏం చూసుకుని కాంగ్రెస్ నాయకత్వం రాష్టవ్రిభజనకు దిగిందో తెలియటం లేదని ఆయన అన్నారు.
ఇప్పటికైనా జరిగిన పొరపాటుని సరిదిద్దుకుంటే మంచిదని హర్షకుమార్ హితవు పలికారు. ఎన్‌ఎస్‌యుఐ నుండి సాధారణ కార్యకర్తగా ఎదిగిన తనకు కాంగ్రెస్ పార్టీ అంటే విపరీతమైన అభిమానమని, పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయబోనని తెలిపారు. పార్లమెంటుతో తెలుగువారి ఏమిటో చూపిస్తామని ఆయన హెచ్చరించారు.
తెలుగువారి సమస్యల్ని ఏమాత్రం పరిష్కరించకుండా ఏకపక్షంగా వ్యవహరించిందని ఆయన విమర్శిచారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి విభజన వద్దని ఎన్నోసార్లు విన్నవించినప్పటికీ జిఒఎం ఆయన వాదనను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ధ్వజమెత్తారు. తమను ఘోరంగా అవమానించిన కేంద్ర ప్రభుత్వాన్ని బ్రతకనివ్వబోమని, అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి తెలుగువారి సత్తాఏమిటో చూపిస్తామని హెచ్చరించారు.












Click it and Unblock the Notifications