Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏపీలో అంతా ఈవీఎంల ట్యాంపరింగే: ఫామ్ 20 నుంచి దృష్టి మళ్లించడానికే తిరుమల లడ్డూ వివాదం

Haryana Assembly Election Results 2024: ఓట్ల లెక్కింపు సందర్భంగా హర్యానాలో చోటు చేసుకున్న పరిణామాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమౌతోన్నాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల పనితీరుపై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసిన తరువాత అందరి దృష్టీ దీని మీదే మళ్లింది. ఎన్నికల్లో మళ్లీ బ్యాలెట్ల వ్యవస్థను ప్రవేశపెట్టాలనే డిమాండ్ ఊపందుకుంటోంది.

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. పోస్టల్ బ్యాలెట్‌లో సునామీ సృష్టించిన ఆ పార్టీ..ఈవీఎంలను తెరిచిన తరువాత కుప్పకూలింది. ఈవీఎం కౌంటింగ్‌ ఆరంభమైన తరువాత భారతీయ జనతా పార్టీ దూసుకెళ్లింది. భారీ మెజారిటీని సాధించింది.

Haryana Assembly elections results 2024 MP Vijayasai Reddy raised doubts on EVM s tampering

పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో తొలి గంటలోనే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 71 నియోజకవర్గాల్లో ఆధిక్యతలో కొనసాగారు. ఆ తరువాత ఫలితాలు తారుమారు అయ్యాయి. బీజేపీ ఒక్క ఉదుటున ఆధిక్యతను సాధించింది. ఈవీఎంలల్లో నిక్షిప్తమైన ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న కొద్దీ కాంగ్రెస్ ఆధిక్యత భారీగా తగ్గుతూ వచ్చింది.

అప్పటివరకు కనీసం పోటీ ఇవ్వలేని స్థితిలో కనిపించిన బీజేపీ ఒక్కసారిగా ముందుకు దూసుకెళ్లింది. చివరికి- 48 సీట్లతో బీజేపీ హ్యాట్రిక్ కొట్టింది హర్యానాలో. 71 స్థానాల్లో ఆధిక్యతలో కనిపించిన కాంగ్రెస్ 37 నియోజకవర్గాలకే పరిమితమైంది. ఈ పరిణామాలను కాంగ్రెస్ జీర్ణించుకోలేకపోతోంది. ఈవీఎంల పనితీరు పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది.

ఈ పరిణామాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వీ విజయసాయిరెడ్డి స్పందించారు. ఏపీలో ఎన్నికలు జరిగిన మూడు నెలల తరువాత ఈసీ ఫామ్ 20ని వెబ్‌సైట్‌లో పెట్టిందని, దీని గురించి మొదటి రెండు వారాలు ఎవరూ కోర్టుకు వెళ్లకుండా ప్రజల్లో చర్చ జరగకుండా టీడీపీ గూండాలు అరాచకం చేశారని ఆరోపించారు.

ఫామ్ 20 వివరాలు బయటకి రాగానే తిరుమల లడ్డు వ్యవహారాన్ని తెరమీదికి తీసుకొచ్చిందని విమర్శించారు. వాళ్ల కుట్రలో భాగంగా పక్కా స్కెచ్‌తో దీన్ని మొదలు పెట్టారని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు నిజనిజాలతో ఎలాంటి పనీ లేదని, ఇది తిరుమల లడ్డూ నెయ్యి కోసమో, భగవంతుడి కోసమో మొదలు పెట్టింది కాదని, ఈవీఎం మోసాలని కప్పిపెట్టటానికి సృష్టించిన అరాచకంగా అభివర్ణించారు.

చంద్రబాబు సరిగ్గా గుజరాత్ వెళ్లి వచ్చిన ఆరు రోజుల తరువాత తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందనే తప్పుడు రిపోర్టును గుజరాత్‌కు చెందిన ఎన్డీడీబీ నుంచి తెప్పించి పెట్టుకున్నాడని విమర్శించారు. టీటీడీకి కొత్త పాలకమండలి వేయకుండా తాత్సారం చేస్తూ వచ్చాడని ధ్వజమెత్తారు.

ప్రజలెవ్వరూ కూడా ఈసీ తన అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచిన ఏపీ ఎన్నికల ఫామ్ 20 గురించి మాట్లాడకుండా, బూత్ వారీ లెక్కలు గురించి విశ్లేషించకుండా ఉండటానికే లడ్డు, ప్రాయశ్చిత్త దీక్షలను తెర మీదికి తెచ్చారని విజయసాయిరెడ్డి విమర్శించారు. ఇదీ స్థూలంగా జరుగుతున్న కుట్ర అని పేర్కొన్నారు.

ఉదాహరణకు హిందూపురంలో ఓ వార్డులో వచ్చిన ఓట్ల గురించి ఆయన ప్రస్తావించారు. ఆ వార్డులో వైసీపీకి ఒక ఓటు పడిందనే విషయం తెలిసిందే. టీడీపీ- 95, బీఎస్పీ- 5, కాంగ్రెస్- 464, అదే వార్డులో లోక్‌సభలో వైసీపీ- 472, కాంగ్రెస్- 1, టీడీపీ- 8, బీఎస్పీ- 83 ఓట్ల పడ్డాయని, ఇది సాధ్యమా? అని ప్రశ్నించారు. ఇలా ఆంధ్రా అంతా ఈవీఎంల ట్యాంపరింగేనని అన్నారు.

లోక్‌సభ ఎన్నికల సందర్భంగా దేశం మొత్తం మీద మొదటి నాలుగు దశల పోలింగ్‌లో బీజేపీకి ఎదురుగాలి వీచిందనేది స్పష్టంగా అర్థమైందని, రిజల్ట్స్ కూడా అలాగే వచ్చాయని సాయిరెడ్డి గుర్తు చేశారు. అయిదు, ఆరు దశల్లో జరిగిన రాష్ట్రాల్లో ముఖ్యంగా అసెంబ్లీకి లోక్‌సభకు కలిపి జరిగిన ఏపీలో ఈవీఎంలను ట్యాంపర్ చేశారని ఆయన వివరించారు.

ఇది చంద్రబాబు, లోకేష్, హరిప్రసాద్, మరి కొంతమంది కలిసి చేసిన కుట్ర అని విజయసాయిరెడ్డి విమర్శించారు. చంద్రబాబు, లోకేష్‌కు హిందూమతంఫై గానీ, భగవంతుడిఫై గానీ నమ్మకం లేదని, వారి కులమే ఒక మతం అని నమ్మే వ్యక్తులని చురకలు అంటించారు. చంద్రబాబు ఈ మోసాలు వెన్నతో పెట్టిన విద్య అని, అందరూ కలిసి ఈ అరాచకానికి తెర తీశారని చెప్పారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+