తెలుగు రాష్ట్రాల సీఎంలను కలిసిన బండారు దత్తాత్రేయ.. కారణం అదే ?
సీనియర్ పొలిటీషియన్, హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిశారు. ముందుగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసంలో ఈ సమావేశం జరిగింది. ఈ మేరకు త్వరలో హైదరాబాద్‌లో నిర్వహించనున్న తన ఆత్మకథ తెలుగు అనువాదం 'ప్రజల కథే నా ఆత్మకథ' పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోరారు.
అలానే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును సైతం దత్తాత్రేయ కలిశారు. తన ఆత్మకథ 'ప్రజల కథే నా ఆత్మకథ' పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానించారు. హైదరాబాద్ వేదికగా ఈ పుస్తకావిష్కరణ వేడుక నిర్వహించనున్నారు. ఈ క్రమంలోనే ఈ వేడుకలో రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు కలుసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. దీంతో దేశ వ్యాప్తంగా పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్న తరుణంలో అటు రాజకీయాల పరంగా.. ఇటు పర్సనల్ గా కూడా వీరి కలయిక ప్రాధాన్యతను సంతరించుకుంది.

బండారు దత్తాత్రేయ తన రాజకీయ, వ్యక్తిగత జీవితంలోని ముఖ్య ఘట్టాలను వివరిస్తూ ఆత్మకథను రచించారు. ఈ పుస్తకం ఇప్పటికే హిందీలో 'జనతా కీ కహానీ, మేరీ ఆత్మకథా' పేరుతో విడుదలైంది. ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలో ఈ హిందీ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇప్పుడు తెలుగు పాఠకుల కోసం 'ప్రజల కథే నా ఆత్మకథ' పేరుతో దీనిని తీసుకువస్తున్నారు.
Met Andhra Pradesh Chief Minister Shri N Chandrababu Naidu ji along with Alai Balai Foundation Chairperson Smt Vijaya Lakshmi Bandaru ji and Dr Jignesh Reddy ji and cordially invited Chief Minister Shri Naidu ji to the launch of my autobiography titled 'Janata Ki Kahani Meri… pic.twitter.com/SNCtjvO6N4
— Bandaru Dattatreya (@Dattatreya) May 18, 2025
Met Telangana Chief Minister Shri A Revanth Reddy ji along with Alai Balai Foundation Chairperson Smt Vijaya Lakshmi Bandaru ji and Dr Jignesh Reddy ji and cordially invited Chief Minister Shri Reddy ji to the launch of my autobiography titled 'Janata Ki Kahani Meri Aatmakatha'… pic.twitter.com/VId6UHem2o
— Bandaru Dattatreya (@Dattatreya) May 18, 2025
-
మూసీ తీరాన ఆధ్యాత్మిక వైభవం.. 700 కోట్లతో భారీ ఆలయాల ప్రాజెక్ట్.. సీఎం శంకుస్థాపన -
మూసీపై బిగ్ స్టెప్- చెప్పిందే చేసిన రేవంత్ -
తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే 15శాతం వేతనం వారి బ్యాంకు ఖాతాల్లో.. సభలో కీలక బిల్లు! -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
today rashiphalalu: మీనరాశిని వదిలిపెట్టని ముఖ్యగ్రహాలు.. వీరి పంట పండుతుంది! -
హైదరాబాద్ జూపార్క్ లో వింత జంతువు.. భారీగా తరలివస్తున్న పర్యటకులు -
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
‘బాహుబలి2’, ‘పుష్ప2’లో నిజమైన ఇండస్ట్రీ హిట్ ఏది? -
కాచిగూడ మీదుగా తిరుపతికి వెళ్లే మరో ప్రత్యేక రైలు.. ఇకపై: ఏపీలో హాల్ట్ స్టేషన్లు












Click it and Unblock the Notifications