వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇంతకీ చంద్రబాబు కోవిడ్ వ్యాక్సిన్ వేయించుకున్నారా...? మంత్రి కన్నబాబు సూటి ప్రశ్న...

|
Google Oneindia TeluguNews

దేశంలో వ్యాక్సినేషన్ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉందని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. వ్యాక్సిన్ సరఫరా కేంద్రం చేతుల్లో ఉంటుందని తెలిసి కూడా టీడీపీ తమపై విమర్శలు చేస్తోందన్నారు. గ్లోబల్ టెండర్లతో వ్యాక్సిన్ సప్లై పెంచి అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేయాలనుకోవడం తప్పా? అని ప్రశ్నించారు. కేంద్రం అనుమతి లేకపోవడం వల్లే గ్లోబల్ టెండర్లకు ఏ కంపెనీ ముందుకు రావట్లేదన్నారు. అందుకే కేంద్రమే దీనిపై చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారని... ఇందులో తప్పేముందని ప్రశ్నించారు. వ్యాక్సిన్ గురించి ఇంతగా మాట్లాడుతున్న చంద్రబాబు అసలు వ్యాక్సిన్ వేయించుకున్నారా? అని ప్రశ్నించారు. 45 ఏళ్లు దాటిన ఆయన వ్యాక్సిన్ వేయించుకోవాలి కదా అని గుర్తుచేశారు.

ఒకవేళ చంద్రబాబు వ్యాక్సిన్ వేయించుకుంటే ఎక్కడ వేయించుకున్నారు..? ఏపీలోనా...లేక తెలంగాణలోనా...? భారత్ బయోటెక్ వాళ్ల వ్యాక్సిన్ వేయించుకున్నారా..? లేక కోవీషీల్డ్ వేయించుకున్నారా..? అని వరుస ప్రశ్నలు సంధించారు. వీటిపై ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.

Has Chandrababu been vaccinated yet minister kurasala kanna babu questions tdp chief

రాష్ట్రంలో ఇల్లు లేని పేద వాడు ఉండకూడదని సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి శ్రమిస్తుంటే దాన్ని ఎలా అడ్డుకోవాలా అని ప్రతిపక్షం చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.చంద్రబాబు హయాంలో కేంద్రం ఇచ్చిన నిధులతో ఇళ్ల పథకానికి ఎన్‌టీఆర్ హౌసింగ్ అని పేరు పెట్టుకోలేదా...? అని ప్రశ్నించారు. కేంద్రం నిధులు ఇవ్వకుండా రాష్ట్రాల్లో పథకాలు అమలవుతాయా? అని ప్రశ్నించారు. కేంద్రం ఇచ్చే నిధులు, మనకు రావాల్సిన పన్నులు చూసుకునే రాష్ట్ర బడ్జెట్‌కు రూపకల్పన చేస్తారని అన్నారు.

Recommended Video

Southwest Monsoon కేరళ సహా దక్షిణాది రాష్ట్రాలపై ప్రభావం | Weather Update | IMD || Oneindia Telugu

సీఎం జగన్ కడుతున్నది ఇల్లు కాదు.. ఊళ్లు అని కన్నబాబు పేర్కొన్నారు. జగనన్న కాలనీల్లో మౌలిక వసతులకు ఎంత ఖర్చు చేస్తున్నారో టీడీపీ వాళ్లకు తెలియదా..? ఆ స్థలాలు ఇవ్వకూడదని అడ్డుకుని కోర్టులో కేసులు వేసింది టీడీపీ వాళ్లు కాదా..? అని ప్రశ్నించారు. చివరికి అమరావతిలో పేదలకు ఇళ్లు ఇస్తే డెమోగ్రాఫికల్ బ్యాలెన్స్ పోతుందని కోర్టుకు చెప్పింది టీడీపీ కాదా అని నిలదీశారు. సంక్షేమ,అభివృద్ది పథకాలతో సీఎం జగన్ ప్రజలకు దగ్గరవుతుంటే టీడీపీ నేతలు ఓర్వలేకపోతున్నారని విమర్శించారు.

English summary
Minister Kannababu said that Andhra Pradesh was at the forefront of vaccination in the country. The TDP has been criticizing them even knowing that the vaccine supply is in center's hands. Is it wrong to increase the supply of vaccines with global tenders and want to vaccinate everyone for free? minister questioned TDP chief.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X