Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పవన్ కళ్యాణ్ కు హైకోర్టు షాక్..! సర్కార్ డబ్బుతో వీరమల్లు ప్రమోషన్ పై..!

ఏపీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు హైకోర్టు షాకిచ్చింది. తన సినిమా హరి హర వీరమల్లు ప్రమోషన్ కోసం మంత్రిగా ఉంటూ ప్రభుత్వ నిధుల్ని వాడుకున్న వ్యవహారంలో సీబీఐ దర్యాప్తు కోరుతూ దాఖలైన పిటిషన్ ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఇందులో సీబీఐ, ఏసీబీ న్యాయవాదుల్ని ప్రతివాదులుగా చేర్చాలని ఆదేశాలు ఇచ్చింది. అయితే ప్రాథమిక విచారణకు ముందే వారికి నోటీసులు ఇవ్వాలని పిటిషనర్ చేసిన విజ్ఞప్తిని మాత్రం తోసిపుచ్చింది.

రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ ప్రభుత్వ నిధులతో తన సినిమా హరి హర వీరమల్లుకు ప్రమోషన్ చేసుకోవడాన్ని ఆక్షేపిస్తూ మాజీ ఐఏఎస్, లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జీఎస్ఆర్కేఆర్ విజయ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ లో ప్రజా ప్రతినిధిగా ఉంటూ తన హరిహరవీరమల్లు సినిమాను ప్రమోట్ చేసుకోవడం, కలెక్షన్లు, లాభాల కోసం సినిమా టికెట్ల ధరల పెంపుపై దృష్టి పెట్టారని ఆరోపించారు. ధరల పెంపునకు సంబంధించిన ఫైలును ఆయనే ప్రాసెస్ చేసినట్లు పవనే చెప్పుకుంటున్నారని, సొంత సినిమా కావడంతో సొంత శాఖ కాకపోయినా ఫైలును ప్రాసెస్ చేయడం అధికార దుర్వినియోగం కిందికే వస్తుందన్నారు.

HC Admits Plea Seeking CBI Probe into Pawan Kalyan s Use of Public Funds for Film Promotion

సినిమాలే తనకు జీవనోపాధి అంటున్న పవన్ కల్యాణ్.. భారత ప్రభుత్వం ఇచ్చిన ప్రవర్తన నియమావళిని పట్టించుకోవడం లేదని, మంత్రి పదవి చేపట్టే ముందు వ్యాపారాలు, ఇతర ఆదాయ మార్గాల్లో భాగస్వామ్యంగా ఉండకూదడదనే నిబంధన పవన్ కల్యాణ్ కు తెలియదా..? అని ప్రశ్నించారు. ఆదాయం కోసం సినిమాల్లో నటిస్తున్నానని చెప్పిన పవన్ కల్యాణ్ తన తప్పును బహిరంగంగానే ఆంగీకరించారని విజయ్ కుమార్ పిటిషన్ లో పేర్కొన్నారు.

అవినీతి నిరోధక చట్టం-1988 ప్రకారం ప్రజాప్రతినిథిగా ఉన్న వ్యక్తి సొంతలాభం కోసం ఇలాంటి పనులు చేయడం నేరమని విజయ్ కుమార్ ఆరోపించారు. ప్రజాప్రతినిథిగా, మంత్రిగా ఉంటూ నిబంధనలు తుంగలొ తొక్కి అధికారాన్ని, ప్రభుత్వ వనరులను దుర్వినియోగం చేసిన పవన్ కల్యాణ్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సీఎస్ కు, ఏసీబీ డీజీకి కూడా లేఖ రాశారు. పవన్ కల్యాణ్ మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. వారు చర్యలు తీసుకోకపోవడంతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

HC Admits Plea Seeking CBI Probe into Pawan Kalyan s Use of Public Funds for Film Promotion

దీన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు.. జాబితాలో సీబీఐ, ఏసీబీ లాయర్ల పేర్లను కూడా చేర్చాలని రిజిస్ట్రీని ఆదేశించింది.
ప్రభుత్వ నిధులతో హరిహర వీరమల్లు చిత్రం ప్రమోషన్ చేసుకోవడం, తన సినిమాకు టికెట్ రేట్లు పెంచుకుంటూ ఆదేశాలు ఇచ్చుకున్నట్లు చెప్పుకోవడం వంటి అంశాల్ని ప్రస్తావిస్తూ.. దీనిపై సీబీఐ దర్యాప్తు చేయించాలని కోరారు. ఈ పిటిషన్ పై విచారణను వారం రోజులకు వాయిదా వేసింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+