అమరావతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఏపీలో 7 గురు గ్రామ వాలంటీర్లకు హైకోర్టు నోటీసులు- లబ్దిదారుల ఎంపిక, తొలగింపు హక్కుందా ?

|
Google Oneindia TeluguNews

ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మంగా భావిస్తున్న గ్రామ సచివాలయాల వ్యవస్ధలో భాగంగా ఉన్న వాలంటీర్లకు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టింది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను క్షేత్రస్దాయికి తీసుకెళ్లి మరింత మెరుగైన సేవలు అందించాలని సూచించింది. అయితే స్ధానికంగా ఉన్న వైసీపీ నేతల ప్రోద్భలంతో కొందరు వాలంటీర్లు అత్యుత్సాహంతో తీసుకుంటున్న నిర్ణయాలు ప్రభుత్వం మెడకు చుట్టుకునేలా ఉన్నాయి.

ముఖ్యంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను తమకు నచ్చనివారి నుంచి దూరం చేసేందుకు వాలంటీర్లు చేస్తున్న ప్రయత్నాలపై ఇవాళ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వైఎస్సార్ చేయూత పథకంలో భాగంగా ఇచ్చే ఆర్ధికసాయం నిలిపేయడంపై గుంటూరు జిల్లా పెదకూరపాడు మండలం గార్లపాడు గ్రామానికి చెందిన 26 మంది గ్రామస్ధులు హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

 hc notices to 7 village volunteers in ap, ask service rules, how can slect beneficiary

గార్లపాడు గ్రామస్ధులకు వైఎస్‌ఆర్‌ చేయూతలో భాగంగా అర్హులకు సాయం నిలిపివేయడంపై హైకోర్టులో విచారణ జరిగింది. గ్రామస్థుల తరఫున న్యాయవాది అరుణ్‌ శౌరి వాదించారు. విచారణ జరిపిన హైకోర్టు.. ఏడుగురు వాలంటీర్లకు వ్యక్తిగతంగా నోటీసులు జారీ చేసింది. అదే సమయంలో వాలంటీర్ల సర్వీసు నిబంధనలు ఏమిటని హైకోర్టుప్రశ్నించింది. తాజాగా శ్రీకాకుళంలో పింఛనుదారుల సొమ్ముతో వాలంటీర్‌ పరారీఘటనపై పత్రికల్లో వచ్చిన వార్తలను హైకోర్టు ప్రస్తావించింది. వాలంటీర్లు లబ్ధిదారుడిని ఎంపిక చేయడంపై హైకోర్టు ప్రశ్నలు వేసింది.
పూర్తి వివరాలతో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రభుత్వ న్యాయవాదికి ఆదేశాలు ఇచ్చింది. పిటిషన్‌ వేయడంతో 26 మందికి చేయూత పథకం మంజూరు చేయాలని ఆదేశించింది.

ఈ సందర్భంగా వాలంటీర్ల వ్యవస్థపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అర్హులకు రాజకీయకక్షతో వైఎస్సార్ చేయూత పథకం నిలిపివేయడంపై విచారణ జరిగిన హైకోర్టు.. వాలంటీర్ల సర్వీస్ నిబంధనలు ఏమిటని ప్రశ్నించింది. వాలంటీర్ అంటే స్వచ్ఛందం కాదా?.. డబ్బులెలా ఇస్తారు? పెన్షన్‍దారుల వాలంటీర్ పరారీ, శ్రీకాకుళంలో ఘటనలపై పత్రిక వార్తలను ప్రస్తావించిన హైకోర్టు జడ్జి జస్టిస్ బట్టు దేవానంద్ .. వాలంటీర్ తప్పు చేస్తే ఎవరు శిక్షిస్తారని ప్రశ్నించారు. లబ్ధిదారుడిని వాలంటీర్లు ఎంపిక చేయడమేంటన్న హైకోర్టు న్యాయమూర్తి..సచివాలయ సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించింది. దీనిపై ప్రభుత్వం నుంచి పూర్తి వివరాలు కోరింది.

English summary
ap high court has issued notices to seven village volunteers for removal of beneficiaries from ysr cheyutha scheme.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X