రోజాకు షాక్: సస్పెన్షన్‌పై స్టేకు హైకోర్టు నిరాకరణ
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యురాలు రోజా సస్పెన్షన్‌పై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది. రోజా సస్పెన్షన్‌పై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. సస్పెన్షన్‌పై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని రోజా న్యాయస్థానాన్ని కోరారు.
ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 29కి వాయిదా హైకోర్టు వేసింది. రోజాను ఏడాది పాటు శాసనసభ నుంచి సస్పెండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాద్ రావు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. దాన్ని రోజా హైకోర్టులో సవాల్ చేశారు.

తన సస్పెన్షన్ విషయంలో స్పీకర్ జారీ చేసిన ప్రొసీడింగ్స్‌ను కొట్టేయాలని రోజా హైకోర్టును కోరారు. శాసనసభ్యురాలిగా అసెంబ్లీలో తన బాధ్యతలను తాను నిర్వర్తించేందుకు వీలుగా ఆదేశాలు జారీ చేయాలని కూడా ఆమె కోరారు .
తన సస్పెన్షన్ విషయంలో స్పీకర్ తన అధికార పరిధిని దాటి వ్యవహరించారని ఆమె ఆరోపించారు. రోజా వ్యవహారంపై విచారణకు స్పీకర్ కూడా ఓ కమిటీని వేసిన విషయం తెలిసిందే. డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలో ఆ కమిటీని వేశారు .












Click it and Unblock the Notifications