ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు: ఆడపిల్ల పుట్టిందని వదిలేశాడు
విజయవాడ: ప్రేమించానని వెంట పడి పెళ్లి చేసుకున్నాడు. రెండేళ్లు కాపురం చేసి ఆడపిల్లను కనిందనే కారణంతో మరో యువతిని పెళ్లడడానికి అతను సిద్ధమయ్యాడు. దీంతో భార్య అతని ఇంటి ముందు ధర్నాకు దిగింది. ఈ సంఘటన విజయవాడలో జరిగింది.
విజయవాడ గవర్నర్‌పేట ఆకులవీధిలో నివాసం ఉంటున్న భార్గవి (25)ని అదే ప్రాంతానికి చెందిన నందిపాటి మధుసూదనరావు (29) ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. వివాహం చేసుకుని రెండేళ్లు కాపురం చేశాడు. వారికి ఆడపిల్ల పుట్టింది.

దాంతో భార్గవిని వదిలేశాడు. కుటుంబ సభ్యులు చెప్పిన మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి మదుసూదనరావు సిద్ధపడ్డాడు. ఈ విషయం తెలిసి భార్గవి గురువారం ఐద్వా సభ్యుల సహకారంతో మధుసూదన్ ఇంటి ముందు ధర్నాకు దిగింది.
తనకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించుకుని కూర్చుంది. భార్గవికి న్యాయం చేయాలని ఐద్వా నాయకులు డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications