సీఎం జగన్ ను రెండో కోణం నుంచి చూస్తే...
నిడదవోలు శెట్టిపేటకు చెందిన రెండేళ్ళ డయానా శాంతి "స్పైనల్ మస్క్యులర్" వ్యాధితో బాధపడుతుండేది.
నిడదవోలు శెట్టిపేటకు చెందిన రెండేళ్ళ డయానా శాంతి "స్పైనల్ మస్క్యులర్" వ్యాధితో బాధపడుతుండేది. జనవరి 3 న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజమహేంద్రవరం రాగా పాప తల్లిదండ్రులు కలిసి తమ కుమార్తెను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వారి పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి అదేరోజు అక్కడికక్కడే ఆదేశాలు జారీచేశారు. మెరుగైన వైద్య చికిత్స అందించేందుకు రూ. లక్ష రూపాయల ఆర్థిక సహాయం, అంతేకాకుండా నెలకు రూ. 10 వేల పింఛను, అవుట్ సోర్సింగ్ కింద డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగం పాప తల్లికి ఇచ్చారు. డయానా శాంతి ఆరోగ్య పరిస్థితి విని స్పందించిన ముఖ్యమంత్రి "ఎయిమ్స్" లో తగిన వైద్య సేవలు అందచేసేందుకు చొరవ తీసుకోవడం జరిగిందని కలెక్టర్ మాధవీలత వెల్లడించారు.
న్యూ ఢిల్లీ ఏయిమ్స్ లో డయానా శాంతి వైద్య సేవలు కోసం ఉదారంగా స్పందించిన @ysjagan#apcmo #ysjagan #oneindiatelugu #nidadavolu pic.twitter.com/YIGoDVs044
— oneindiatelugu (@oneindiatelugu) March 1, 2023
నిడదవోలుకు సీఎం జగన్ వచ్చిన సందర్భంగా డయానా తల్లి సూర్యకుమారి జగన్ ను కలిసి ధన్యవాదాలు తెలియజేసింది. ఈ సందర్భంగా తన కుమార్తె వైద్య సేవల కోసం న్యూ ఢిల్లీ కి వెళ్లి రావడం చాలా ఖర్చుతో కూడుకున్నట్లు తెలియజేసింది. ప్రభుత్వ పరంగా సహాయం అందచెయ్యడం జరుగుతుందని భరోసా ఇచ్చిన ముఖ్యమంత్రి, వైద్య సేవల కోసం న్యూ ఢిల్లీకి వెళ్లి రావడానికి అవసరమైన చేయూతను అందచేయాలని ఆదేశించారు. ఇందుకోసం రూ.2 లక్షలు ఆర్థిక సహాయం ప్రకటించడంతోపాటు ఐదు నెలల పాటు ముఖ్యమంత్రి ఆదేశాలు మేరకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ కె.మాధవీలత తెలిపారు.

యుఎస్ఎ నుంచి పాప వైద్యానికి సంబంధించి రిస్డిప్లం IT gene therapy ఇంజెక్షన్ ఇవ్వవలసి ఉంటుందని, ఈ ఇంజెక్షన్ సుమారు రూ.14 కోట్ల రూపాయల ఖరీదు ఉండటంతో కొద్ది నెలలపాటు పాప వైద్య పరీక్షలు చెయ్యవలసి ఉందన్నారు. తగిన వైద్య సేవలు పొందేందుకు వీలుగా న్యూ ఢిల్లీకి వెళ్లి రావడం కోసం విమాన ప్రయాణం ఖర్చులు , వసతి తదితర ఖర్చుల తగిన ఆర్థిక సహాయం చేయాలంటూ సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారని కలెక్టర్ తెలిపారు.













Click it and Unblock the Notifications