Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఏకాంతంగా, బాబుకు మోడీ హామీ కానీ: 'రేవంత్‌'పై రిపోర్ట్, గవర్నర్ మౌనం!

న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం మధ్య వివాదానికి కారణమైన ఓటుకు నోటు వ్యవహారం ఢిల్లీకి చేరుకుంది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి, గవర్నర్ నరసింహన్.. రాష్ట్రపతి, ప్రధాని, కేంద్రమంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. బిజీబిజీగా గడుపుతున్నారు.

చంద్రబాబు ఉదయం నుండి పలువురు కేంద్రమంత్రులను కలిశారు. ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. దాదాపు గంటపాటు ఆయనతో మాట్లాడారు. ఈ భేటీలో నోటుకు ఓటు వ్యవహారం చర్చకు వచ్చిందని తెలుస్తోంది. చంద్రబాబు దీనిపై వివరించగా, సరైన సమయంలో స్పందిస్తానని ప్రధాని మోడీ హామీ ఇచ్చినట్లుగా సమాచారం.

చంద్రబాబు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, అరుణ్ జైట్లీ, బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా తదితరులను కలిశారు. ఓటుకు నోటు వ్యవహారం, హైదరాబాదులో తమకు భద్రత లేదని ఫిర్యాదు, సెక్షన్ 8ను అమలు చేయాలని, ఫోన్ ట్యాపింగ్ పైన ఫిర్యాదు చేశారని తెలుస్తోంది.

మోడీతో, అమిత్ షాతో చంద్రబాబు వేర్వేరుగా ఏకాంతంగా దాదాపు గంటసేపు చొప్పున మాట్లాడారు. చంద్రబాబు రాష్ట్రపతితోను భేటీ అయ్యారు. గవర్నర్ నరసింహన్ కూడా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర హోంశాఖ కార్యదర్శితో పాటు పలువురిని కలిశారు. ఆయన తెలుగు రాష్ట్రాల తాజా పరిణామాల పైన వారికి నివేదిక ఇచ్చారు.

Heat of Cash for Vote in Delhi

రాష్ట్రపతి ప్రణబ్, హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌తో భేటీ సమయంలో విభజన చట్టాల అమలు, హైదరాబాద్ తదితర అంశాలు చర్చకొచ్చాయని తెలుస్తోంది. ప్రతిపక్ష నేత వైయస్ జగన్ పలువురు కేంద్రమంత్రులను కలిశారు. ఓటుకు నోటు వ్యవహారంలో చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారని తెలుస్తోంది.

జగన్ సాయంత్రం కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభుతో భేటీ అయ్యారు. విభజన నేపథ్యంలో ఏపీకి మరిన్ని రైళ్లు కేటాయించాలని కోరారు. రాష్ట్రంలో పెండింగులో ఉన్న రైల్వే ప్రాజెక్టులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు.

కేంద్ర ఇంటిలిజెన్స్ చైర్మన్‌తో గవర్నర్ భేటీ

గవర్నర్ నరసింహన్ కేంద్ర ఇంటెలిజెన్స్ చైర్మన్‌తో భేటీ అయ్యారు. అంతకుముందు రాష్ట్రపతి, కేంద్ర హోంశాఖ మంత్రితో భేటీ అయ్యారు. రేవంత్ రెడ్డి వ్యవహారం పైన గవర్నర్ నివేదిక ఇచ్చారని తెలుస్తోంది.

ఓటుకు నోటు, సెక్షన్ 8పై గవర్నర్ మౌనం

ఢిల్లీలో గవర్నర్ నరసింహన్ విలేకరులతో మాట్లాడారు. ఇది సాధారణ పర్యటనే అని చెప్పారు. రెండు రాష్ట్రాల తాజా పరిస్థితి పైన తాను వివరించానని చెప్పారు. కాగా, ఆయన ఓటుకు నోటు, సెక్షన్ 8 అంశాల పైన స్పందించలేదు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+