ఏపీలో నేడు ఆ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఎక్కడెక్కడంటే ?
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ప్రజలకు ఊహించని షాక్ ఇస్తుంది. ఓ వైపు భానుడి భగభగలు ఉంటూనే మరోవైపు అకస్మాత్తుగా భారీ వర్షాలు కురుస్తుండడం అయోమయానికి గురి చేస్తోంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఏపీలో రానున్న మూడు రోజులు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
తీరం దాటేది అక్కడే..
తూర్పుమధ్య అరేబియా సముద్రంలో దక్షిణ కొంకణ్ తీరానికి సమీపంలోని వాయుగుండం తూర్పు వైపునకు నెమ్మదిగా కదులుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఇది రత్నగిరి సమీపంలో తీరాన్ని దాటే అవకాశం ఉందని వివరించింది. ఈ ఎఫెక్ట్ తోనే నేడు ( మే 25, ఆదివారం ) అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి,కాకినాడ, తూర్పుగోదావరి, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది.

రేపు ( మే 26, సోమవారం ) అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా,పల్నాడు, గుంటూరు, బాపట్ల, ప్రకాశం, నంద్యాల, కర్నూలు,అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో విస్తృతంగా మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
అంతే కాకుండా తీరం వెంబడి గంటకు 40-50కిమీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని స్పష్టం చేసింది. హోర్డింగ్స్, చెట్ల క్రింద, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాలు వద్ద ప్రజాలు ఉండొద్దని సూచించింది. పిడుగులతో కూడిన వర్షాలు నేపధ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇక ఈ ఏడాదిలోనే పిడుగుపాటుకు గురై పలువురు ప్రాణాలు పోగొట్టుకున్న ఘటనలు సైతం చోటుచేసుకున్నాయి.
-
AP Govt: ఇక రాష్ట్రమంతా సంజీవని..! చంద్రబాబు కీలక ఆదేశాలు..! -
ఏపీ ప్రజలకు డిసెంబర్ లోగా మరో బహుమానం.. ఫిక్స్ చేసిన సీఎం చంద్రబాబు -
ఏపీ, తెలంగాణలో జనగణన - ఇవ్వాల్సిన వివరాలు, మార్గదర్శకాలు..!! -
ఏపీలో ఏకీకృత పెన్షన్ పథకం మార్గదర్శకాలు జారీ..! ఈ ఉద్యోగులకు..! -
End of Naxalism : ఆంధ్రప్రదేశ్‌లో ముగిసిన ఎర్రజెండా శకం.. -
AP Govt: ఏపీలో ఇవాళ 2.5 లక్షల మందికి ఇళ్లు-టిడ్కో లబ్దిదారులకూ..! -
ఇంటర్ మూల్యాంకనం పూర్తి, ఫలితాల డేట్ ఫిక్స్ - ఏపీ.. తెలంగాణలో ఇలా..!! -
ఏపీ ప్రజలకు రూ.11వేలు రాయితీతో ఈ సైకిళ్లు, మిస్ చేసుకోకండి -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!!












Click it and Unblock the Notifications