తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, పలుచోట్ల విద్యుత్ నిలిపివేత
హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్, కరీంనగర్, జగిత్యాల, హుజురాబాద్ తదితర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం పడుతోంది. భారీ వర్షం కారణంగా పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
కోస్తాంధ్రపై ఉపరితల ఆవర్తనం, దక్షిణ మరాఠ్వాడా నుంచి విదర్భ మీదుగా సాగుతున్న అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో గత రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి.
హైదరాబాదు నగరంలో మలక్ పేట, పంజాగుట్ట, అమీర్ పేట, కోటి, రామ్ నగర్ తదితర దాదాపు అన్ని ప్రాంతాల్లో వర్షం నీరు రోడ్లపైకి వచ్చి పారుతోంది. రోడ్లన్నీ జలమయమయ్యాయి. మరో ఒకటి రెండు రోజులు వర్షాలు ఇలాగే ఉండనున్నాయి.

బయటి ప్రాంతాల నుంచి బస్సులు వేకువజామున వస్తున్న సమయంలో రోడ్లపై ట్రాఫిక్ మెల్లిగా ముందుకు సాగింది. పలుచోట్ల విద్యుత్ సరఫరా నిలిచింది. విశాఖపట్నం, గుంటూరు, ప్రకాశం, ఉభయగోదావరి జిల్లాలు, మహబూబ్ నగర్, జగిత్యాల, రంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం, అదిలాబాద్, మేడ్చల్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది.












Click it and Unblock the Notifications