ఆర్ఆర్‌సి పరీక్షల్లో ‘హైటెక్’ కాపీయింగ్: 30మంది అరెస్ట్(పిక్చర్స్)

హైదరాబాద్: రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సి) పరీక్షలో హైటెక్ పద్ధతిలో మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్న ముఠా గుట్టును స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్‌వోటి) పోలీసులు రట్టు చేశారు. ఎలక్ట్రానిక్ డివైజ్‌లు, బ్లూటూత్‌లతో ఆధారంగా హైదరాబాద్‌తోపాటు తెలంగాణ, ఏపి వ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ యత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు.

పేపర్ లీక్ అయిందన్న విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుకున్న మల్కాజ్‌గిరి ఎస్‌వోటి పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించారు. మౌలాలి రైల్వే క్వార్టర్స్ పరిసర ప్రాంతంలోని ఉప్పరగూడ సాలార్‌జంగ్ వాటర్ పంప్ వద్ద జరిపిన దాడుల్లో మాస్ కాపీయింగ్ ముఠాకు చెందిన 20 మంది సభ్యులను అరెస్ట్ చేశారు. వారి ద్వారా రైల్వే ఉద్యోగి మచేందర్ పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు.

పోలీసులు మచేందర్‌తోపాటు 20 మంది ముఠా సభ్యులను, 10 మంది అభ్యర్థులను ఆదివారం సాయంత్రం మీడియా ముందు ప్రవేశపెట్టారు. మల్కాజ్‌గిరి ఎస్‌వోటి అదనపు డిసిపి రామచంద్రారెడ్డి మాస్ కాపీయింగ్ కుట్ర భగ్నం విషయాలను మీడియాకు వెల్లడించారు. రైల్వే ఉద్యోగి మచేందర్ పరీక్ష పత్రాన్ని లీక్ చేయడంతోపాటు జవాబులు చెబుతానని చెప్పి ఒక్కో అభ్యర్థి నుంచి రూ. 5 లక్షల చొప్పున భారీగా వసూళ్లకు పాల్పడ్డాడు.

హైటెక్ కాపీయింగ్

హైటెక్ కాపీయింగ్

రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సి) పరీక్షలో హైటెక్ పద్ధతిలో మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్న ముఠా గుట్టును స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్‌వోటి) పోలీసులు రట్టు చేశారు.

హైటెక్ కాపీయింగ్

హైటెక్ కాపీయింగ్

ఎలక్ట్రానిక్ డివైజ్‌లు, బ్లూటూత్‌లతో ఆధారంగా హైదరాబాద్‌తోపాటు తెలంగాణ, ఏపి వ్యాప్తంగా వివిధ కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ యత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు.

హైటెక్ కాపీయింగ్

హైటెక్ కాపీయింగ్

పేపర్ లీక్ అయిందన్న విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందుకున్న మల్కాజ్‌గిరి ఎస్‌వోటి పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించారు.

హైటెక్ కాపీయింగ్

హైటెక్ కాపీయింగ్

మౌలాలి రైల్వే క్వార్టర్స్ పరిసర ప్రాంతంలోని ఉప్పరగూడ సాలార్‌జంగ్ వాటర్ పంప్ వద్ద జరిపిన దాడుల్లో మాస్ కాపీయింగ్ ముఠాకు చెందిన 20 మంది సభ్యులను అరెస్ట్ చేశారు.

హైటెక్ కాపీయింగ్

హైటెక్ కాపీయింగ్

వారి ద్వారా రైల్వే ఉద్యోగి మచేందర్ పేపర్ లీకేజీ వ్యవహారంలో ప్రధాన నిందితుడిగా పోలీసులు గుర్తించారు.

హైటెక్ కాపీయింగ్

హైటెక్ కాపీయింగ్

అరెస్ట్ చేసిన వారి వద్ద నుంచి 8 ఇన్ బిల్ట్ సిమ్ కార్డులు, రెండు ల్యాప్ ట్యాప్‌లు, 9 బ్లూటూత్, ఐదు సిమ్ కార్డులు, 27 సెల్‌ఫోన్లు, 3 డేటా కార్డులు, 17 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

పేపర్ లీకేజీ అనంతరం జవాబులను తయారు చేసేందుకుగాను ఇలియాస్, వరుణ్, గిరిధర్, వెంకటేష్, అశోక్, శ్రీనివాస్‌లతో ఓ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాడు. అభ్యర్థులకు ముందుగానే మెడలో తాయెత్తు రూపంలో ఉండే ఎలక్ట్రానిక్ డివైజ్, చెవిలో బయటకు కనబడని విధంగా ఉండేలా ఓ బ్లూటూత్‌ను అందజేశాడు. నగరంలోని వివిధ కేంద్రాల్లో ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఆర్‌ఆర్‌సి పరీక్ష జరగాల్సి ఉంది.

ఓ పరీక్ష కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న మచేందర్ ప్రశ్న పత్రాలను బయటకు తీసిన వెంటనే ఫోన్‌లో ఫొటో తీసి వాట్సాప్ ద్వారా తన బృందానికి పంపించాడు. మౌలాలి రైల్వే క్వార్టర్స్ ప్రాంతంలో ఓ గదిలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకున్న ముఠా సభ్యులు జవాబులు తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు.

ఈ క్రమంలో విశ్వసనీయ వర్గాల ద్వారా పేపర్ లీక్ సమాచారం అందుకున్న మల్కాజ్‌గిరి ఎస్‌వోటి పోలీసులు మూడు బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో మధ్యా హ్నం 2.30 గంటల ప్రాంతంలో నగరంలోని పలు పరీక్ష కేంద్రాల్లో ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో దిల్‌సుఖ్‌నగర్ పబ్లిక్ స్కూలులో ముగ్గురు, చైతన్యపురిలోని శ్రీచైతన్య జూనియర్ కాలేజీలో ఇద్దరు, తిరుమలగిరిలోని గౌతం మోడల్ స్కూలులో ఐదుగురు అభ్యర్థులు మొత్తం 10 మందిని అరెస్ట్ చేశారు.

దాడుల్లో భాగంగా 20 మంది కాపీయింగ్ ముఠా సభ్యులను కూడా అరెస్ట్ చేశారు. కాగా ప్రధాన నిందితుడు మచేందర్ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అరెస్ట్ చేసిన వారి వద్ద నుంచి 8 ఇన్ బిల్ట్ సిమ్ కార్డులు, రెండు ల్యాప్ ట్యాప్‌లు, 9 బ్లూటూత్, ఐదు సిమ్ కార్డులు, 27 సెల్‌ఫోన్లు, 3 డేటా కార్డులు, 17 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. మాస్ కాపీయింగ్‌ను భగ్నం చేసిన ఎస్‌వోటి పోలీసులను సైబరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ ప్రత్యేకంగా అభినందించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+