ఎమ్మెల్యే కొలికపూడి వ్యవహరంలో హైకమాండ్ సీరియస్.. త్రిసభ్య కమిటీ !
తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు వ్యవహారంపై టీడీపీ హైకమాండ్ మరోసారి సీరియస్ అయింది. ఒక ఎమ్మెల్యేకి పార్టీ క్రమశిక్షణ సంఘం నోటీసులిచ్చి పిలిపించి.. విచారించడం అంటే మామూలు విషయం కాదు.. అలాంటిది గెలిచిన ఏడు నెలల్లో కొలికపూడి శ్రీనివాసరావు రెండు సార్లు డిసిప్లీనరీ కమిటీ ముందు రెండు సార్లు అటెండ్ అవ్వాల్సి వచ్చింది.. ఆయన వ్యవహార తీరుతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. గీత దాటుతున్నారు జాగ్రత్త అని క్రమశిక్షణ సంఘంతో వార్నింగులు ఇప్పించుకోవాల్సి వచ్చింది.
కానీ మళ్లీ ఆయన పార్టీ సూచనలను బేఖాతరు చేస్తున్నారనే అసంతృప్తి పార్టీ అధిష్ఠానంలో నెలకొంది. ఇది పార్టీ ప్రతిష్ఠను దిగజార్చేలా ఉందని టీడీపీ హైకమాండ్ భావిస్తోంది. ఆయన తీరు మార్చుకోకపోతే కఠిన చర్యలు తప్పవని పార్టీ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గట్టి వార్నింగ్ జారీ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పార్టీ ఎంపీ, జిల్లా అధ్యక్షుడు, సమన్వయకర్తలతో కూడిన త్రిసభ్య కమిటీని వేసి, కొలికిపూడి ప్రాతినిధ్యం వహిస్తున్న తిరువూరు నియోజకవర్గంలో గత 10 నెలలుగా జరుగుతున్న పరిణామాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది.

గతంలో మద్యం దుకాణా లు.. ఒక సర్పంచ్ భార్య ఆత్మహత్యాయత్నం వంటి విషయాల్లో పార్టీ నాయకత్వం ఎమ్మెల్యే నుంచి వివరణ కోరింది. పార్టీ క్రమశిక్షణా కమిటీ వద్ద హాజరైన ఎమ్మెల్యే తన వాదన వినిపించారు. ఇక నిన్ననే మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రమేశ్ రెడ్డి పైన స్థానిక ప్రజలు ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేసారు. రమేశ్ రెడ్డి పైన పార్టీ 48 గంటల్లోగా చర్యలు తీసుకోకుంటే రాజీనామా చేస్తానని కొలికపూడి సంచలన ప్రకటన చేసారు. లోన్ కోసం ఒక అమ్మాయి ఫోన్ చేస్తే సమాజం సిగ్గుపడేలా అసభ్యకరంగా మాట్లాడారని మండిపడ్డారు.
రమేశ్ రెడ్డికి విజయవాడ ఎంపీ కార్యాలయం లోని వారి నుంచి మద్దతు లభిస్తోందని చెప్పుకుంటు న్నారని పేర్కొన్నారు. చిన్ని ఆఫీసులోని కిషోర్ నాలుగు ట్రాక్టర్లు 50 లక్షలు ఇచ్చాను రమేష్ రెడ్డి అంటున్నారని.. తాను విచారిస్తే ఒక టాక్టర్ ఇచ్చిన మాట వాస్తవమని తేలిందని చెప్పుకొచ్చారు. ఇలా వరుసగా వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయిన.. కొలికపూడి శ్రీనివాసరావు ఈసారైనా జాగ్రత్తగా ఉంటారా, లేదా అనే విషయం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.












Click it and Unblock the Notifications