గ్రూప్ -2 పోస్టులకు లైన్ క్లియర్: రెండు రోజుల్లో ఫలితాలు
హైదరాబాద్: గ్రూపు-2 పోస్టుల భర్తీకి అడ్డంకులు తొలగిపోయాయి. పరీక్షల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయంటూ దాఖలైన వ్యాజ్యాలను హైకోర్టు తోసిపుచ్చింది. గ్రూపు-2 పోస్టులకు జరిగిన పరీక్షల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ దాఖలైన వ్యాజ్యాలను జస్టిస్ వి. రామసుబ్రమణియన్, జస్టిస్ ఎం. గంగారావులతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది.
ఎక్కడో చిన్న,చిన్న లోపాలు ఉన్నాయనే ఆరోపణలపై రంధ్రాన్వేషణ చేసి మొత్తం ఉద్యోగాల భర్తీని నిలుపుదల చేయలేమని తేల్చి చెప్పింది. 982 గ్రూపు-2 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ పెద్ద కసరత్తే చేసిందని వ్యాఖ్యానించింది.

కంప్యూటర్ లేబొరేటరీల్లో రాత పరీక్షలు నిర్వహించి అభ్యర్థులు హాజరైన సమయం, బయటకు వచ్చిన సమయాలను నమోదు చేసిందని కోర్టు అభిప్రాయపడింది. ట్రైబ్యునల్, హైకోర్టుల తీర్పుతో ఒకటి రెండు రోజుల్లో ఫలితాలు విడుదల చేయాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది.












Click it and Unblock the Notifications