రాజధాని వ్యాజ్యాలపై హైకోర్టులో కీలక పరిణామం - రిజిస్ట్రీకి ఆదేశం..!!
అమరావతిలో ఇతర ప్రాంతాలవారికి ఇళ్ల పట్టాల కేటాయింపు, ఇళ్ల నిర్మాణాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై తామే విచారణ జరుపుతామని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం వెల్లడించింది. సీఆర్డీఏ చట్టాన్ని సవరించి రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన యాక్ట్ 13/2022, తదనంతరం జారీ చేసిన జీవో 45ని సవాల్ చేస్తూ దాఖలైన అన్ని వ్యాజ్యాలను తమ ముందుంచాలని పేర్కొంది. విచారణను ఈ నెల 17వ తేదీకి వాయిదా వేసింది.
అమరావతి పరిధిలో ఆర్ -5 జోన్ లో ఇళ్ల నిర్మాణం పైన కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటీషన్లను తామే విచారించాలని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం నిర్ణయించింది. రాజధాని నగరం, రాజధాని ప్రాంతాన్ని ఆరు నెలల్లో అభివృద్ధి చేయాలని హైకోర్టు ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏ అమలు చేయకపోవడాన్ని సవాల్ చేస్తూ రాజధాని ప్రాంత రైతులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై విచారణ సందర్భంగా త్రిసభ్య ధర్మాసనం ఈ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆర్- 5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాన్ని నిలిపివేయాలని రైతులు దాఖలు చేసిన వ్యాజ్యం కూడా త్రిసభ్య ధర్మాసనం ముందు విచారణకు రానుంది.

రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పనకు నిర్దిష్ట గడువు విధిస్తూ న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలపై మాత్రమే సుప్రీంకోర్టు స్టే విధించిందని రైతుల తరఫున సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధరరావు వాదనలు వినిపించారు. ఇతర ఆదేశాలను అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్రప్రభుత్వంపై ఉందని తెలిపారు. అమరావతిలో మౌలిక సదుపయాలను నెల రోజుల్లో పూర్తి చేయాలని..డెవలప్ చేసిన ప్లాట్లను మూడు నెలల్లో రైతులకు ఇవ్వాలని హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును రాష్ట్ర ప్రభుత్వం, సీఆర్డీఏ అమలు చేయట్లేదని హైకోర్టులో వ్యాజ్యాలు వేశారు. రాజధాని నిర్మాణం విషయంలో హైకోర్టు తీర్పులోని కొన్ని అంశాల పైనే సుప్రీంకోర్టు స్టే ఇచ్చిందని న్యాయవాది మురళీధర రావు వాదించారు.
సుప్రీంకోర్టులో రాష్ట్రప్రభుత్వం వేసిన ఎస్‌ఎల్‌పీ పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో విచారణను ఎనిమిది వారాలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ (ఏజీ) ఎస్.శ్రీరామ్, అదనపు అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, సీఆర్డీఏ తరఫు న్యాయవాది కాసా జగన్మోహన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. సీఆర్డీఏ చట్టాన్ని సవరిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన యాక్ట్ 13/2022, తదనంతరం జారీ చేసిన జీవో 45ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై త్రిసభ్య ధర్మాసనం విచారణ జరపాల్సి ఉందన్నారు. ప్రస్తుత వ్యాజ్యాలపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.
-
Amaravati: పీఎంవో అత్యవసర ఆదేశాలు-28న ఏపీ అసెంబ్లీ ప్రత్యేక భేటీ..! -
పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రానికి మంత్రి విన్నపాలు! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!!











Click it and Unblock the Notifications