చంద్రబాబు ప్రభుత్వంపై మరో పిడుగు
రాష్ట్ర విభజన జరిగి పది సంవత్సరాలు అవుతోంది. కానీ ఇంతవరకు విభజన హామీలు అమలుకు నోచుకోలేదు. ప్రధానంగా ప్రత్యేక హోదాను మరుగున పడేశారు. ప్రత్యేక హోదాపై అనేక పోరాటాలు చేసిన జగన్ సైతం తాను అధికారంలోకి వచ్చిన తర్వాత , దీనిపై నోరు మెదిపింది లేదు. తాజాగా అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం కూడా ప్రత్యేక హోదా గురించి ఎక్కడా మాట్లాడని పరిస్థితి.ఇటువంటి తరుణంలో ప్రత్యేక హోదాపై ఏపీ హైకోర్టు కేంద్రానికి నోటీసులు ఇవ్వడం ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది.
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ప్రత్యేక హోదా గురించి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ ఆర్థికంగా నిలదొక్కుకోవాలంటే కేంద్రం నుంచి ఆర్థిక సహాయం, సహకారం అవసరమని కేఏ పాల్ కోర్టుకు వివరించారు. ఏపీకి విభజన తర్వాత ప్రత్యేక హోదా పాటు కేంద్రం నుంచి మద్దతు చాలా అవసరం అని ఆయన అన్నారు. ఏపీ ప్రస్తుత, గత ప్రభుత్వాలు సైతం ప్రత్యేక హోదా కోరుతున్న వైనాన్ని ప్రస్తావించారు. కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.ఈ వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ నరేందర్, జస్టిస్ కిరణ్ మై తో కూడిన ధర్మాసనం కేంద్రానికి నోటీసులు జారీ చేయడం విశేషం.

ప్రత్యేక హోదాకు సంబంధించి పూర్తి వివరాలు సమర్పించాలని కేంద్ర ఆర్ధిక శాఖ, హోం శాఖ, నీతి అయోగ్ చైర్మన్ లతో పాటు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు ఇచ్చింది.ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 24 కు వాయిదా వేసింది. ప్రత్యేక హోదాని అంతా మరచిపోతున్న తరుణంలో ఆ తేనే తుట్టెను కేఏ పాల్ కదిల్చారు. గత కొద్దిరోజులుగా కేఏ పాల్ ప్రత్యేక హోదాపై గట్టిగానే పోరాడుతున్నారు. ఏదో విధంగా కేంద్రం చెవిలో జోరిగలా ఈ హోదా మాట వినిపించేలా చేశారు. ఇప్పుడు ఏకంగా హైకోర్టు నుంచి నోటీసులు వచ్చేలా చేశారాయన. ఓ రకంగా ఇది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పెద్ద సమస్య అని చెప్పాలి. మరి ఈ నోటీసులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.












Click it and Unblock the Notifications