విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

కేశినేని నాని సహా టిడిపి నేతలకు హైకోర్టు నోటీసులు, ఎందుకంటే?

విజయవాడ రోడ్డు రవాణా సంస్థ కమిషనర్ పై దాడి ఘటనలో విజయవాడ ఎంపీ కేశినేని నానితో పాటు పలువురు టిడిపి ప్రజా ప్రతినిధులకు హైకోర్టు నోటీసులను జారీ చేసింది.తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

By Narsimha
|
Google Oneindia TeluguNews

విజయవాడ: విజయవాడ రోడ్డు రవాణా సంస్థ కమిషనర్ పై దాడి ఘటనలో విజయవాడ ఎంపీ కేశినేని నానితో పాటు పలువురు టిడిపి ప్రజా ప్రతినిధులకు హైకోర్టు నోటీసులను జారీ చేసింది.తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది.

గత నెలలో రవాణ సంస్థ కమిషనర్ పై విజయవాడ ఎంపి కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వర్ రావుతో పాటు పలువురు రవాణ శాఖ కమిషనర్ పై దాడికి పాల్పడ్డారు.

high court issued notice to Vijayawada MP Kesineni Nani

ఈ విషయమై ఓ పత్రికలో వచ్చిన కథనాలను హైకోర్టు పిల్ స్వీకరించింది.హైకోర్టు కేసును సుమోటోగా స్వీకరించింది.దీనిపై మంగళవారం నాడు హైకోర్టు విచారణ జరిపింది.

ఈ ఘటనపై ప్రతివాదులు 11 మందికి నోటీసులు జారీ చేసింది. టిడిపి ఎంపీ కేశినేని నాని, టీడీపి ఎమ్మెల్యే బొండా ఉమా మహేశ్వర్ రావు, మేయర్ కోనేరు శ్రీధర్, ఎమ్మెల్సీ బుడ్డా వెంకన్న, పోలీస్ హౌసింగ్ బోర్డు ఛెర్మైన్ నాగుల్ మీరా, ఆంధ్రప్రదేశ్ హోంశాఖ, ట్రాన్ప్ పోర్ట్ ప్రిన్సిఫల్ సెక్రటరీలకు, ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ ఏపీ డీజిపి విజయవాడ సీపిలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

English summary
The High court issued notice to Vijayawada MP Kesineni Nani on Tuesday.Kesineni and others attacked transport commissioner at Vijayawada in last month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X