పథకాల నగదు విడుదల పై హైకోర్టు తాజా ఉత్తర్వులు..!!

ఏపీలో పోలింగ్ వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాల నిధల విడుదల వ్యవహారం కీలక మలుపు తీసుకుంది. పథకాల నిధుల విడుదలకు ఎన్నికల సంఘం అభ్యంతరా ల పైన ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. పోలింగ్ ముందు నిధుల విడుదలకు ఎన్నికల సంఘం అంగీకరించలేదు. దీని పైన తొలుత హైకోర్టులో ఒక్క రోజులో నిధుల విడుదలకు అనుమతి వచ్చింది. దీని పైన హైకోర్టులో దాఖలైన పిటీషన్ పైన విచారించిన డివిజన్ బెంచ్ కీలక ఆదేశాలు ఇచ్చింది.

డీబీటీ పథకాల పై
ఏపీలో ఎన్నికల సమయంలో నిధుల విడుదల పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి. దీంతో, పోలింగ్ పూర్తయిన తరువాత నిధులు విడుదల చేయాలని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. దీని పైన లబ్ది దారులు హైకోర్టుకు వెళ్లగా ఈ ఒక్క రోజులో నిధుల విడుదలకు అనుమతి దక్కింది. కానీ, ఇక్కడే అసలు ట్విస్ట్ తెర మీదకు వచ్చింది. తాజాగా లబ్దిదారులకు ప్రభుత్వం డీబీటీ ద్వారా నగదు జమ చేయటంపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 14న నగదు జమ చేసుకోవచ్చని గతంలో ఇచ్చిన ఈసీ ఇచ్చిన ఆదేశాలు కొనసాగిస్తూ హైకోర్టు ఆదేశించింది.

High Court latest orders for DBT schemes funds deposits in the bank Big Shock for YSRCP

హైకోర్టులో విచారణ
ఇవాళ ఒక్కరోజు నగదు బదిలీ చేసేందుకు వెసులుబాటు ఇస్తూ సింగిల్ బెంచ్ ఆదేశాలు సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై డివిజన్ బెంచ్ లో విచారణ తరువాత ఈ ఆదేశాలు ఇచ్చారు. ఈ నెల 13న పోలింగ్ ఉన్న కారణంగా తర్వాత రోజున DBT ద్వారా నగదు బదిలీ చేసుకోవాలనీ గతంలోనే ఈసీ ఆదేశాలు జారీ చేసింది. గురువారం హైకోర్టు సింగిల్ బెంచ్ ఈ ఒక్క రోజు (శుక్రవారం)లోనే ఎలాంటి ఆర్భాటం లేకుండా నిధులు పంపిణీకి అనుమతి ఇచ్చింది. ఎన్నికల సంఘం ఆదేశాల పైన ఒక్క రోజు స్టే విధించింది. 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు పథకాల నిధుల విడుదలకు అనుమతి లేదని స్పష్టం చేసింది.

పోలింగ్ తరువాతనే
దీంతో, కోర్టు తీర్పుకు అనుగుణంగా నిధుల విడుదల అంశం పైన ఏపీ ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని సంప్రదించింది. ఎన్నికల సంఘం ప్రభుత్వంలో నిధుల వ్యవహారం నుంచి ఈ రోజునే ఎందుకు జమ చేయాల్సి ఉందనే అంశాల పైన పూర్తి సమాచారం కోరింది. ఇటు హైకోర్టులో దాఖలైన పిటీషన్ పైన డివిజన్ బెంచ్ విచారించింది. ప్రభుత్వం ఇప్పుడు ఎన్నికల కోసం తీసుకున్న నిర్ణయం కాదని..అయిదేళ్ల కాలంగా అమలవుతున్న పథకాలుగా వివరించింది. పూర్తి వాదనల తరువాత హైకోర్టు ఈ నెల 13న పోలింగ్ తరువాత నిధుల విడుదల చేయాలంటూ ఈసీ ఆదేశాలను సమర్ధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+