విశాఖ కాపులుప్పాడలో స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణంపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
కాపులుప్పాడ కొండపై అతిథిగృహం నిర్మాణంపై హైకోర్టు ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కాపులుప్పాడలో గ్రేహౌండ్స్ కు చెందిన 300 ఎకరాల్లో 30 ఎకరాల ను స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం ఏపీ ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే.
ఏపీ ప్రభుత్వం విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా మార్చడానికి నిర్ణయం తీసుకున్న తర్వాత స్టేట్ గెస్ట్ హౌస్ నిర్మాణం కోసం కాపులుప్పాడ లో యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టిన విషయం తెలిసిందే .

ఈ వ్యవహారంపై అమరావతి జేఏసీ నేతలు గద్దె తిరుపతి రావు కోర్టులో వేసిన పిటిషన్ పై శుక్రవారం హైకోర్టు ధర్మాసనం విచారణ జరిపింది .
ఈ కేసులో పిటిషనర్ తరఫు న్యాయవాది మురళీధర్ హైకోర్టు ధర్మాసనానికి వాదనలు వినిపించారు. గ్రేహౌండ్స్ కు కేటాయించిన స్థలంలో రాష్ట్ర అతిథి గృహం ఎలా ప్రభుత్వం నిర్మిస్తుంది అంటూప్రశ్నించిన ఆయన కేంద్ర బలగాలకు చెందిన గ్రేహౌండ్స్ నక్సల్స్, టెర్రరిస్ట్ ల వ్యతిరేక దళంగా సీక్రెట్ ఆపరేషన్ నిర్వహిస్తుందని పిటిషనర్ తరపు వాదనలు వినిపించిన న్యాయవాది పేర్కొన్నారు.
వాదనలు విన్న హైకోర్టు ధర్మాసనం విశాఖపట్నంలో గెస్ట్ హౌస్ నిర్మాణంపై ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అలాగే గెస్ట్ హౌస్ కు కేటాయించిన 30 ఎకరాల్లో ఉన్న చెట్లను కూడా నరక వద్దని హైకోర్టు ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. దీనిపై వారం రోజుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ వ్యవహారంలో కేంద్రాన్ని కూడా పార్టీ చేయాలని పేర్కొంది.
-
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ!












Click it and Unblock the Notifications