RRR: ఆ రోజు చేసిన పనికి సీఐడీ మాజీ అధికారులకు మైండ్ బ్లాక్
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఓవైపు తిరుమల లడ్డు కల్తీ నెయ్యి వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వాడివేడిగా ఉన్నాయి. ఇదే సమయంలో వైసీపీ నాయకులకు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తిరుమల శ్రీవారి లడ్డూల కల్తీ నెయ్యి వ్యవహారంపై ప్రజలకు సరైన సమాధానం చెప్పలేక చాలామంది వైసీపీ నాయకులు వారివారి ఇళ్లకే పరిమితమయ్యారు. కొంతమంది వైసీపీ నాయకులు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోయారని ఆరోపణలు ఉన్నాయి.
ఇలాంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చకు దారితీశాయి. మరోవైపు ప్రస్తుత టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే, గత జగన్ హహాయంలో ఆనాటి వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణరాజు కేసులో సీఐడీ మాజీ అధికారి విజయ్ పాల్ కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊహించి ఎదురుదెబ్బ తగిలింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఆ పార్టీ నాయకులు అండతో తనను అరెస్టు చేసి తనను చిత్రహింసలకు గురి చేశారని, పోలీస్ స్టేషన్ లో పెట్టి కొట్టారని అప్పటి వైసీపీ ఎంపీ, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు సీఐడీ మాజీ అధికారి విజయ పాల్ తో పాటు కొందరు మాజీ సీఐడీ అధికారుల మీద కేసు పెట్టారు.

ఈ కేసులో సీఐడీ మాజీ అధికారులను అరెస్టు చేసి తనకు న్యాయం చేయాలని టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో సీఐడీ మాజీ ఏఎస్ పీ విజయ్ పాల్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి ముందస్తు బెయిల్ మంజూరు చెయ్యాలని మనవి చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఇరువైపుల వాదనలు పూర్తయ్యాయి. వాదనలు పూర్తి కావడంతో ఈనెల 24వ తేదీ మంగళవారం బెయిల్ పిటిషన్ పై తీర్పు వెల్లడిస్తామని హైకోర్టు చెప్పింది.
మంగళవారం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సీఐడీ మాజీ ఏఎస్ పి విజయ్ పాల్ బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. కేసు ప్రాథమిక దర్యాప్తులో ఉన్నందున మాజీ సీఐడీ అధికాకి ముందస్తు బెయిల్ మంజూరు చేయరాదని రఘురామ కృష్ణంరాజు తరపు న్యాయవాదులు ఇటీవల హైకోర్టుకు మనవి చేశారు. ఇరువైపుల వాదనలు విన్న హైకోర్టు సీఐడీ మాజీ ఏఎస్ పీ విజయ్ పాల్ కు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.

సీఐడీ మాజీ అధికారి విజయ్ పాల్ సమర్పించిన బెయిల్ పిటిషన్ కొట్టేసింది. హైకోర్టులో బెయిల్ రాకపోవడంతో సీఐడీ మాజీ అధికారులు ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారని తెలిసింది. అయితే విజయ పాల్ పై ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనపై చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశం ఉందని న్యాయనిపుణులు అంటున్నారు. ఈ విషయంపై టీడీపీ ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు హ్యాపీగా ఉన్నారని తెలిసింది.












Click it and Unblock the Notifications