Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీడీపీ నేతల జంట హత్యల కేసులో పిన్నెల్లి సోదరులకు బిగ్ షాక్!

వైసిపి మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులకు ఏపీ హైకోర్టు షాక్ ఇచ్చింది. తెలుగుదేశం పార్టీ నేతల జంట హత్యల కేసులో నిందితులుగా ఉన్న వీరి ముందస్తు బెయిల్ పిటీషన్ ను హైకోర్టు ధర్మాసనం నేడు కొట్టివేసింది. వైసీపీ నాయకులకు దీంతో చుక్కెదురైంది.

టీడీపీ నాయకుల హత్య కేసులో పిన్నెల్లి బ్రదర్స్
పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి మండలం గుండ్లపాడుకు చెందిన టిడిపి నాయకులు జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావుల హత్యలో పిన్నెల్లి సోదరుల ప్రమేయం ఉందని పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ప్రత్యక్ష సాక్షి మృతి, మృతుల బంధువు అయిన ఆంజనేయులు చేసిన ఫిర్యాదు మేరకు నిందితుల పైన సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు.

High Court shocks Pinnelli brothers in TDP leaders double murder case

Take a Poll

ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి సోదరుల పిటీషన్
అయితే ఈ కేసులో పిన్నెల్లి సోదరులను ఏ 6, ఏ 7గా పేర్కొన్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి a6 కదా, పిన్నెల్లి వెంకటరామిరెడ్డి a7 గా పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో తమను పోలీసులు అరెస్ట్ చేయకుండా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరులు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపైన కోర్టులో పోలీసులు తరఫున అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ ఆగస్టు 21వ తేదీన వాదనను వినిపించారు.

హైకోర్టులో బలంగా వాదనలు
తెలుగుదేశం పార్టీ నాయకుల హత్య కేసులో పిన్నెల్లి సోదరుల పాత్ర ఉందని అందుకు ఆధారాలు కూడా ఉన్నాయని ఆయన హైకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. తెలుగుదేశం పార్టీ నాయకుల జంట హత్యల వెనుక పిన్నెల్లి సోదరుల కుట్ర ఉందని, వారి ప్రోద్బలం ఉందని పేర్కొన్నారు. అంతేకాదు హత్య చేసిన వారికి పిన్నెల్లి సోదరులకు మధ్య జరిగిన సంభాషణల ఫోన్ రికార్డింగ్ లు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.

బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారన్న అడ్వకేట్ జనరల్
నిందితులంతా ఓ రెస్టారెంట్లో సమావేశమే హత్యకు కుట్ర పన్నారని ఈ కేసులో అసలు ఏం జరిగింది అనే వాస్తవాలను వెలికి తీయాలంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ని, ఆయన సోదరుడు వెంకట్రామిరెడ్డిని కస్టడీలోకి తీసుకొని విచారించాలని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకువెళ్లారు. వారికి బెయిల్ ఇస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారని అన్నారు.

పిన్నెల్లి బ్రదర్స్ బెయిల్ పిటీషన్ కొట్టివేత
ఆర్థికంగా రాజకీయంగా వారు బలవంతులు కాబట్టి సాక్షాలను సైతం ప్రభావితం చేసే అవకాశం ఉందని కాబట్టి ముందస్తు బెయిల్ ఇవ్వకూడదని పోలీసులు తరఫున అడ్వకేట్ జనరల్ బలంగా వాదనలు వినిపించారు. 21వ తేదీన జరిగిన విచారణలో ఇరువైపుల వాదనలు విన్న ధర్మాసనం తీర్పు వాయిదా వేసింది. ఇక తాజాగా నేడు పిన్నెల్లి సోదరుల ముందస్తు బెయిల్ కేసులో వారి బెయిల్ పిటీషన్ ను కొట్టివేసి షాక్ ఇచ్చింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+