వైఎస్ జగన్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్.. పులివెందులలో హైడ్రామా.!

పులివెందుల పుర ఎన్నికలలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు వచ్చిన వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఊహించని పరిణామం ఎదురైంది. బెంగళూరు నుంచి పులివెందులకు బయలుదేరిన ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌కు ల్యాండింగ్ అనుమతి నిరాకరించడంతో కాసేపు తీవ్ర నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. సుమారు 20 నిమిషాల పాటు హెలికాప్టర్ గాల్లోనే చక్కర్లు కొట్టాల్సి రావడం, ఇంధనం సైతం ఖాళీ అవుతుండటంతో పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.

చివరి నిమిషంలో ముందస్తు అనుమతుల రద్దు!

శనివారమే హెలికాప్టర్ ల్యాండింగ్‌కు సంబంధించిన అన్ని అనుమతులనూ పోలీసులు, అధికారులు మంజూరు చేసినప్పటికీ.. చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకోవడం వివాదానికి దారితీసింది. మధ్యాహ్నం 2:30 గంటల తర్వాతే ల్యాండింగ్‌కు అవకాశం ఇస్తామంటూ కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ కొత్త ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అయితే అప్పటికే బెంగళూరు నుంచి హెలికాప్టర్‌లో వైఎస్ జగన్ బయలుదేరి రాగా, మార్గమధ్యంలోనే వాహనాన్ని వెనక్కి మళ్లించాలని అధికారులు ఆపరేటర్‌కు ఫోన్ చేసి సూచించారు.

High Tension in Pulivendula YS Jagan Helicopter Makes Emergency Landing Due to Denial of Permission
పులివెందులలో హై టెన్షన్: జగన్ టూర్ రీ షెడ్యూల్
పులివెందులలో హై టెన్షన్: జగన్ టూర్ రీ షెడ్యూల్

ఇంధన కొరతతో ఎమర్జెన్సీ ల్యాండింగ్!

అధికారుల ఆదేశాలతో గాల్లోనే సుదీర్ఘ సమయం వేచి చూడాల్సి రావడం, మరోవైపు ఇంధన సమస్య తలెత్తడంతో పైలట్ చాకచక్యంగా వ్యవహరించి పులివెందులలోనే అత్యవసర ల్యాండింగ్ చేశారు. వైఎస్ జగన్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ పులివెందులలో అడుగుపెట్టనివ్వకుండా అడ్డుకోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం, అధికారులు కుట్రపూరితంగా వ్యవహరించారని వైఎస్సార్‌సీపీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.

ఫస్ట్ ఓటు పడింది.. పుర పోరు ప్రారంభమైంది
ఫస్ట్ ఓటు పడింది.. పుర పోరు ప్రారంభమైంది

పులివెందుల నివాసానికి చేరుకున్న జగన్

హెలికాప్టర్ క్షేమంగా ల్యాండ్ అయిన అనంతరం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పులివెందులలోని తన నివాసానికి చేరుకున్నారు. కొద్దిసేపు విశ్రాంతి తర్వాత ఆయన స్థానిక పోలింగ్ కేంద్రానికి వెళ్లనున్నారు. మధ్యాహ్నం లోపు మున్సిపల్ ఎన్నికలలో తన ఓటు హక్కును వినియోగించుకోనున్నట్లు వైఎస్సార్‌సీపీ వర్గాలు స్పష్టం చేశాయి. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+