ఏపీలో అత్యధికంగా పోలింగ్ నమోదైన నియోజకవర్గం ఏదో తెలుసా..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కీలక ఘట్టం ముగిసింది. చెదురుమొదురు ఘటనలు మినహా సోమవారం నాడు జరిగిన ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. గత నెల రోజులుగా రాజకీయ పార్టీల అధినేతలు తమ అభ్యర్థుల గెలుపు కోసం విసృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇక నేతల జాతకం ఈవీఎం మిషన్లలో నిక్షిప్తం అయ్యాయి.చెదురుమొదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ సరళిని బట్టి ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఓటర్ల తీర్పు ఎలా ఉండబోతుందో అని నేతలు సైతం ఆందోళనకు గురవుతున్నారు.
తమది అధికారమంటే.. తమదే అధికారమని పార్టీ నేతలు చెబుతున్నప్పటికీ...లోలోపల మాత్రం గెలుస్తామో లేదో అని భయాందోళన చెందుతున్నారు. గతంలో ఎప్పుడు లేన్నంతగా ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమ సొంత గ్రామాల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి ప్రజలు ఆసక్తి చూపించడంతో ఈసారి ఓటింగ్ శాతం పెరిగింది. ఏపీలో దాదాపు 81 శాతం ఓటింగ్ జరిగింది. 2019 సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఇది ఎక్కువే. గత ఎన్నికల్లో 79.8 శాతం పోలింగ్ నమోదైంది.

ఈసారి ఎన్నికల్లో 81 శాతం కావడంతో ఎవరికి లాభం ఎవరికి నష్టం అనేది రాజకీయ నాయకులు ఓ అంచనా వేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా సీఈఓ ముఖేష్ కుమార్ మీనా పోలింగ్‌పై మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలోని మొత్తం 81.86 శాతం ఓట్లు పోలైనట్లు వెల్లడించారు. ఈవీఎంల ద్వారా 80.66 శాతం, మిగతా ఓట్లు బ్యాలెట్ పేపర్ల ద్వారా పడినట్లు తెలిపారు. ఇక దర్శి నియోజకవర్గంలో అత్యధికంగా 90.91శాతం పోలింగ్ నమోదైనట్లు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. తిరుపతి నియోజకవర్గంలో అత్యల్పంగా 63.32 శాతం నమోదైంది. 3500 కేంద్రాల్లో అర్ధరాత్రి వరకు పోలింగ్ కొనసాగిందని ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా చెప్పుకొచ్చారు.












Click it and Unblock the Notifications