వైసీపీ ఓడిపోతోందని జగన్ కూ తెలుసు ! టీడీపీవైపు ఎమ్మెల్యేల చూపు ? బాలకృష్ణ షాకింగ్..
ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ ఇవాళ సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లుడు నారా లోకేష్ పాదయాత్రలో పాల్గొనేందుకు శింగనమల వచ్చిన బాలయ్య.. పాదయాత్రలో పాల్గొన్న అనంతరం జగన్ సర్కార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా వైసీపీ తాజా పరిస్ధితి, వైసీపీ ఎమ్మెల్యేల గురించి బాలయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి.
ఏపీలో వైసీపీ ఓటమి అంచుల్లో ఉందని బాలకృష్ణ వ్యాఖ్యానించారు. ఆ విషయం జగన్ కూ తెలుసన్నారు. అందుకే వైసీపీ ఎమ్మెల్యేలు చాలా మంది టీడీపీతో టచ్ లోకి వస్తున్నారన్నారు. వారిలో అసంతృప్తి పెరిగిపోతోందని బాలయ్య తెలిపారు. వైసీపీ అరాచకాల్ని ప్రశ్నించేందుకు అంతా ముందుకు రావాలని కోరారు. జగన్ సీఎం అయ్యాక రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి శూన్యమని, పరిశ్రమలు రావడం లేదని ఆరోపించారు.

రాష్ట్రంలో ల్యాండ్, శాండ్ మాఫియా రెచ్చిపోతోందని బాలకృష్ణ ఆరోపించారు. వీటిని ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని విమర్శించారు. పేద వాళ్లు బతికే పరిస్ధితి కూడా లేదన్నారు. చెత్త పైనా పన్ను వేసే దౌర్భాగ్య పరిస్ధితి ఏపీలో ఉందని బాలయ్య ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో మళ్లీ సైకో పాలన వస్తే ప్రజలు మరో చోటికి వలస పోవాల్సిందేనన్నారు. అప్పుడు రాష్ట్రం మరో శ్రీలంక అవుతుందన్నారు.












Click it and Unblock the Notifications